AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇదేంటి గోవిందా.. వెళ్లింది భక్తితో.. చేసింది గోల.. బస్సులో సీటు కోసం కొట్టుకున్న భక్తులు..

Dwaraka Tirumala Temple: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న శేషాచల కొండపై భక్తులు ఒకరినొకరు ఘర్షణ పడ్డారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు

Watch Video: ఇదేంటి గోవిందా.. వెళ్లింది భక్తితో.. చేసింది గోల.. బస్సులో సీటు కోసం కొట్టుకున్న భక్తులు..
Dwaraka Tirumala Temple
Shaik Madar Saheb
|

Updated on: Dec 13, 2021 | 3:31 PM

Share

Dwaraka Tirumala Temple: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న శేషాచల కొండపై భక్తులు ఒకరినొకరు ఘర్షణ పడ్డారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కొండ దిగువ నుండి దేవస్థానం ఉచిత బస్సులో శేషాచల కొండపై ఆలయానికి చేరుకుంటారు. అయితే ఆలయం తూర్పు వైపు జంటగోపురాల వద్ద ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న భక్తులు ఘర్షణకు దిగారు. బస్సులో సీటు కోసం ఏర్పడ్డ ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది. భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు గొడవ పెద్దదిగా మారింది. భక్తుల ఘర్షణ నేపథ్యంలో బస్సులో అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. బస్సులో భక్తుల మధ్య ఘర్షణను గమనించిన దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. బస్సులో నుంచి భక్తులను కిందకు దింపేశారు. అనంతరం ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతిపజేశారు. దీంతో వివాదం సద్దుమనిగింది.

ఇదంతా చూసిన తోటి భక్తులు నవ్వుకుంటున్నారు. భగవంతుడి దర్శనార్థం వెళ్తూ.. ఇలా పావుగంట ప్రయాణించే బస్సులో సీటు కోసం కొట్టుకుంటారా..? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

గోవింద నామాలు ఉచ్చరించాల్సిన నోటితో గుడికి వెళ్తూ పరస్పరం తిట్ల దండకం చదవిన వారిపట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర స్థలంలో ఇలాంటి చర్యలకు పూనుకోవడం ఎంటంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read:

Kesineni Nani: వ్యవసాయ ఎగుమతులకు కేంద్రంగా బెజవాడ.. సౌకర్యాలు కల్పించండి.. లోక్‌సభలో ఎంపీ కేశినేని నాని

Skill Development Case: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఊరట.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ముందస్తు బెయిల్..