Andhra Pradesh: చిత్తూరులో మృతి చెందిన 3 ఏనుగుల ఖననం.. చూసేందుకు తరలివచ్చిన ఏనుగుల మంద..
మనుషులు ప్రాణాలు కోల్పోతే వారి బంధువులు, సన్నిహితులు ఎంత విలపిస్తారో.. జంతువులు కూడా అంతకు మించి విలపిస్తాయి. పలమనేరులో సంచరిస్తున్న ఏనుగుల మందనే ఇందుకు నిదర్శనం. చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్డు ప్రమాదంలో 3 ఏనుగులు మృతి చెందాయి.

మనుషులు ప్రాణాలు కోల్పోతే వారి బంధువులు, సన్నిహితులు ఎంత విలపిస్తారో.. జంతువులు కూడా అంతకు మించి విలపిస్తాయి. పలమనేరులో సంచరిస్తున్న ఏనుగుల మందనే ఇందుకు నిదర్శనం. చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్డు ప్రమాదంలో 3 ఏనుగులు మృతి చెందాయి. వాటి మృతదేహాలను అటవీ అధికారులు, స్థానికులు ఖననం చేశారు. అయితే, తమ మందలోని కొన్ని ఏనుగులు ప్రాణాలు కోల్పోవడంతో.. మిగతా ఏనుగులు విలపిస్తున్నాయి. వాటిని ఖననం చేసిన ప్రాంతంలోనే ఏనుగుల మంద సంచరిస్తుంది.
హైవే పక్కన వీటిని పూడ్చిపెట్టిన చోటకు ఇవాళ తెల్లవారుజామున ఏనుగుల గుంపు వచ్చింది. కాసేపటి వరకు అక్కడే తిష్టవేశాయి. ఏనుగుల మందను గమనించిన స్థానికులు హడలిపోయారు. తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది.. స్థానికుల సాయంతో ఏనుగుల గుంపును జగమర్ల అటవీ ప్రాంతంలోకి వెళ్లేలా డ్రైవ్ చేశారు. కాగా, రోడ్డు పక్కనే చనిపోయిన ఏనుగులను ఖననం చేయడం.. మిగతా ఏనుగులు అక్కడికి రావడంతో హైవేపై ప్రయాణం చేస్తున్న వాహనదారులు హడలిపోతున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..