Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 నెలల పసికందు మర్డర్‌ కేసులో వీడిన మిస్టరీ.. ఇలాంటి అమ్మ, అమ్మమ్మలు కూడా లోకంలో ఉంటారా!

పిఠాపురంలో 5 నెలల పసికందును చంపి బావిలో పడేసిన ఘటన ఇటీవల కలకలం రేపిన సంగతి తెలిసిందే. తన పక్కలోనే బిడ్డను పడుకోబెట్టుకున్న తల్లి అర్ధరాత్రి సమయంలో బిడ్డ కనిపించడం లేదంటూ లబోదిబోమంటూ ఏడ్వసాగింది. ఇరుకుపొరుగు పోగైపోలీసులకు సమాచారం అందించడంతో తెల్లవారు జామున ఇంటి సమీపంలోని బావిలో బిడ్డ మృతదేహం..

5 నెలల పసికందు మర్డర్‌ కేసులో వీడిన మిస్టరీ.. ఇలాంటి అమ్మ, అమ్మమ్మలు కూడా లోకంలో ఉంటారా!
Mother Killed Her 5 Month Old Baby
Follow us
Srilakshmi C

|

Updated on: May 13, 2025 | 12:17 PM

పిఠాపురం, మే 13: వారం రోజుల క్రితం కాకినాడలోని పిఠాపురంలో 5 నెలల పసికందును చంపి బావిలో పడేసిన ఘటన తెలిసిందే. తన పక్కలోనే బిడ్డను పడుకోబెట్టుకున్న తల్లి అర్ధరాత్రి సమయంలో బిడ్డ కనిపించడం లేదంటూ లబోదిబోమంటూ ఏడ్వసాగింది. ఇరుకుపొరుగు పోగైపోలీసులకు సమాచారం అందించడంతో తెల్లవారు జామున ఇంటి సమీపంలోని బావిలో బిడ్డ మృతదేహం లభ్యమైంది. బావికి దగ్గరలో మృతి చెందిన పసికందు అమ్మమ్మ సెల్‌ ఫోన్‌ లభ్యం కావడంతో పోలీసుల ఫోకస్‌ తల్లి, అమ్మమ్మల మీదకు మళ్లింది. పైగా కేసును పక్కదోవ పట్టించేందుకు వారి ఇంటి గుమ్మం దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కనిపించడంతో క్షుద్రపూజ చేసి బిడ్డను బలిచ్చారనే తొలుత అందరూ భావించారు. అయితే అసలు సూత్రదారులు కన్నతల్లి, అమ్మమ్మలనే విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడపంది. సీఐ శ్రీనివాసు, ఎస్సై మణికుమార్‌ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం..

రెండేళ్ల క్రితం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నరసింగపురానికి చెందిన రెండేళ్ల క్రితం తన కుమార్తె శైలజ ఇంటి నుంచి వెళ్లిపోయి సతీష్‌ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. ఆమె గర్భం దాల్చడంతో కొద్దికాలం క్రితం ఆమె కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. అనంతరం శైలజకు ఆడ బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకు యశ్విత అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగింది. ఈక్రమంలో శైలజ మనసు మార్చి తన కులస్థుడికే ఇచ్చి రెండో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. ఇందుకు శైలజ తల్లి పసుపులేటి అన్నవరం పథకం పన్నింది. మనవరాలిని అడ్డు తొలగించేందుకు మే 6న పసికందు యశ్వితను అన్నవరం, శైలజ ఇద్దరూ కలిసి గొంతు నులిమి హత్య చేసి, అనంతరం పక్కింట్లోని బావిలో పడేసి ఏం ఎరగనట్లు అదే రోజు అర్ధరాత్రి బిడ్డ కనిపించడం లేదంటూ నానాయాగి చేశారు. క్షుద్రపూజలు జరిగినట్లు నమ్మించేందుకు ఇంటిముందు పసుపు, కుంకుమ చల్లి నిమ్మకాయలు పెట్టారు.

శైలజ భర్త పెదపాటి సతీష్‌ పోలీసులకు అదే రోజు అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మరుసటిరోజు ఉదయం మృత శిశువును బావిలో గుర్తించారు. సీఐ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా అసలు సంగతి బయటపడింది. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని ఐదు నెలల పసికందును అమ్మ, అమ్మమ్మ కలిసి చంపేశారన్న వార్త ఆ ఊరంతా దావానంలా వ్యాపించింది. పోలీసులు తల్లికూతుళ్లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.