Andhra Pradesh: అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రమాణం..
ఏపీలో ఎన్నికల హడావుడి ముగిసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో.. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

ఏపీలో ఎన్నికల హడావుడి ముగిసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో.. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. బుచ్చయ్య చౌదరితో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తోపాటు.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా రెండురోజుల పాటు 174 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు గోరంట్ల బుచ్చయ్యచౌదరి.
ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గోరంట్లకు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచి కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పటికే మంత్రులకు శాఖలు సైతం కేటాయించగా.. ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. దానిలో భాగంగానే.. రేపు ఉదయం 9గంటల 46 నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer has administered oath to Sri Gorantla Butchaiah Chowdary, MLA, as Pro tem Speaker at a programme held in Durbar Hall at Raj Bhavan on Thursday.@GORANTLA_BC pic.twitter.com/YJvVBItNf7
— governorap (@governorap) June 20, 2024
ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేసిన గోరంట్ల.. ఎమ్మెల్యేలందరితో ప్రమాణస్వీకారం చేయిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే.. జగన్ కూడా అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాలని ఆశిస్తున్నామన్నారు గోరంట్ల బుచ్చయ్యచౌదరి. అటు.. ప్రోటెం స్పీకర్‌గా తనతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌కు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
