Heliconia: అంతరపంటగా ‘చిలక ముక్కు’ లాంటి పుష్పాలు.. మన రాష్ట్రంలోనే సాగు.. కాసుల వర్షం కురిపిస్తుందట..

ప్రకృతిలో ఎన్నో రకాల జీవజాతులు, జలచరాలు, మొక్కలు, పుష్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా వేరు వేరు ఆకారాలు రూపాల్లో ఉంటాయి. కానీ.. అల్లూరి మన్యంలో గుత్తులు గుత్తులుగా విరబూసిన ఆ పుష్పాలు అచ్చం చిలక ముక్కును పోలి కనువిందు చేస్తున్నాయి. హెలికోనియాగా పేరుగాంచిన పుష్పాలు.. ఇవి ఏజెన్సీలో పూయడం అరుదు. శాస్త్రవేత్తల ప్రయోగం ఫలించడంతో.. పుష్కలంగా పూస్తున్నాయి. ఎరుపు ముదురాకు పచ్చ వర్ణాల్లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఆ పుష్పాలను చూసి శాస్త్రవేత్తలు, గిరిజనం మురిసిపోతున్నారు.

Maqdood Husain Khaja

| Edited By: Surya Kala

Updated on: Jun 20, 2024 | 9:01 PM

చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రములో హెలికొనియా పుష్పాలు విరబూసాయి. హెలికొనియ అనేది హెలికొనియాసిమ్ అనే మెనైటైపిక్ చెందిన పుష్పించే మెక్కల జాతికి చెందినది. ఇండోర్ ప్లాంట్ లో కూడా ఈ మొక్కలను పెంచుకోవచ్చు. ఇవి ఎక్కువగా ఉష్ణ మండలము అడవులలో కనిపిస్తాయి. ఉష్ణ మండల ప్రాంతాలో వీటిని హెలికోనియా అని, చిలకముక్కు పుష్పాలు, ప్యారేట్ పీక్ అని కూడా అంటారు. వీటిని ఎక్కువగా అలంకరణ కోసం ఉపయోగిస్తారు.

1 / 6
ఆకులు కూడా అరిటాకులను పోలి ఉంటాయి కానీ అంత పొడవు ఉండవు. వీటి పుష్పాలు దాదాపు 3 వారాలపాటు ఉంటాయి. అలంకరణలో ఈ పుష్పలను విరివిగా వినియోగిస్తూ ఉంటారు. దీంతో ఈ పుష్పాలకు మంచి డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. అయితే ఉష్ణ మండల ప్రాంతాల్లోనే పుష్పించే ఈ హెలికోనియా.. ఇప్పుడు శీతల వాతావరణం ఉండే చింతపల్లి ఏజెన్సీలో కూడా.. విరబూయడంతో ఆ దిశగా ప్రయోగాలను మరింత వేగవంతం చేశారు.

2 / 6
హెలికొనియాను అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. వీటికి నీడ అవసరం. ఆయిల్ ఫామ్, కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసుకోవచ్చని అంటున్నారు  చింతపల్లి వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం ఉద్యాన శాస్త్రవేత్త వి శివకుమార్.

3 / 6
ఈ చిలుక ముక్కు పువ్వుల సాగు కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్నదే. ఎందుకంటే.. ఒక మొక్క నాటితే.. ప్రక్కన పిలకలు మొలుస్తాయి. ఆ పిలకలు తీసి నాటుకున్నట్లయితే కొత్త మొక్కలు పెరుగుతాయి. వాటికి మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉంటుందని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.

4 / 6
కేరళ రాష్ట్రంలో హలికోనియాతో పాటు బరాప్యారడైజ్ అనే ఇంకో రకం మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి కూడా హెలికొనియా పుష్పాలను పోలి ఉంటాయి. ఉష్ణ మండల ప్రాంతంలో హలికోనియా అని, చిలకముక్కు పుష్పాలు, ప్యారెట్ పీక్ అని అంటారు. ఈ పంట చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.

5 / 6
మన రాష్ట్రంలో ఉష్ణ మండల ప్రాంతంలో తేమ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ పంటను సాగు వేసుకోవచ్చు. కొబ్బరి, ఆయిల్ ఫామ్, వక్క తోటల్లో అంతర పంటగా సాగు చేసుకోవడానికి  మంచి అవకాశం ఉంది. మార్కెట్ సదుపాయం చూసుకొని రైతులు ఈ పంట వేయగలిగితే ఆశించే ఫలాలు ఉంటాయని అంటున్నారు వ్యవసాయ ఉద్యాన శాస్త్రవేత్తలు.

6 / 6
Follow us