AP Crime News: ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘరానా మోసం.. చిట్టీల పేరుతో రూ.కోట్లు వసూలు.. చివరకు..

Government teacher fraud: అతనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. చిట్టీల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత అందరినీ నమ్మించి

AP Crime News: ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఘరానా మోసం.. చిట్టీల పేరుతో రూ.కోట్లు వసూలు.. చివరకు..
Money
Follow us

|

Updated on: Feb 24, 2022 | 8:20 AM

Government teacher fraud: అతనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. చిట్టీల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత అందరినీ నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఈ క్రమంలో అతను కనిపించకపోవడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రూ. కోట్లు వసూలు చేసి రాత్రికిరాత్రే ఉడాయించాడు. ఈ షాకింగ్ సంఘటన ఏపీలోని ప్రకాశం (prakasam district) జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు (teacher) రామ్‌ నాయక్‌ చిట్టీల పేరుతో భారీ మొత్తంలో వసూలు చేసి పరారయ్యాడు. ఈ క్రమంలో ఆయన ఇంటికి బాధితులు చేరుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బాధితుల ఫిర్యాదు మేరకు దర్శి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామ్‌నాయక్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడు పట్టుబడిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read:

AP Crime News: అత్యాశ అసలుకే మోసం తెచ్చింది.. రూ. కోట్లు వసూలు చేసి జనాన్ని నట్టేట ముంచిన వెల్ఫేర్ సంస్థ..

Indian Railway: థర్డ్‌ ఏసీ, ఎసీ-3 ఎకానమీ కోచ్‌ల మధ్య తేడా ఏమిటి..? ఈ కోచ్‌లు ఇతర వాటికి భిన్నంగా ఎందుకుంటాయి..?