AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర రాష్ట్రాల్లోనూ ఈహెచ్‌ఎస్‌ సేవలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్
Cm Jagan
Ram Naramaneni
|

Updated on: Aug 13, 2022 | 4:49 PM

Share

AP Govt Employees: ఏపీ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. EHS(Employee Health Scheme)కార్డు ద్వారా.. వేరే రాష్ట్రాల్లోనూ మెడికల్ సర్వీసులు అందుకునే సౌలభ్యం కల్పించింది. అంతేకాదు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ లిస్ట్‌లో ఇప్పటివరకు లేని 565 వైద్య సేవలను నూతనంగా చేర్చింది. ఇటీవల పలు ఎంప్లాయిస్ యూనియన్స్‌తో నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు.. EHSపై సర్కార్ తాజా ఆదేశాలు జారీ చేసింది. EHS ద్వారా ట్రీట్మెంట్ పొందిన వారికి బిల్లులను.. ఆరోగ్య శ్రీ స్కీమ్ పద్దతిలోనే 21 రోజుల్లో ఆటోడెబిట్ స్కీమ్ ద్వారా చెల్లింపులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విధానం వల్ల.. రిటైర్డ్ ఎంప్లాయిస్, వారి ఫ్యామిలీ మెంబర్స్ EHS కార్డుపై ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది. నెట్ వర్క్ హస్పిటల్స్‌లో EHS కార్డుల సమన్వయం కోసం ఆరోగ్యమిత్రలకు విధి విధానాలు జారీ చేస్తామని గవర్నమెంట్ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్వర్వులును వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు జారీ చేశారు. దీంతో పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షాన్ని వ్యక్తం చేస్తూ.. సీఎం జగన్‌(CM Jagan)కు థ్యాంక్స్ చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…