AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి నచ్చిన చోటే ఫ్లాట్

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు.. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్‌ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి నచ్చిన చోటే ఫ్లాట్
Ap Govt
Aravind B
|

Updated on: Mar 22, 2023 | 12:24 PM

Share

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు.. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్‌ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఎక్కడ పనిచేస్తున్నవారైనా.. వారు కోరుకున్నచోట ప్లాట్‌ తీసుకోనే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఉద్యోగులు పనిచేస్తున్న ప్రాంతంలో ఉన్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల్లో మాత్రమే కొనుగోలు చేసేందుకు వీలుండేది. దీంతో ఉద్యోగుల విజ్ఞప్తుల మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఈ నిబంధనలను సడలించి జీవో నంబరు 38 జారీచేసింది. ఈ కొత్త జీవో ద్వారా ప్లాట్‌ను రాష్ట్రంలో ఎక్కడైనా ఎంపిక చేసుకుకోవచ్చు. రాష్ట్రంలోని 22 నగరాలు, పట్టణాల్లో అన్ని అనుమతులు, ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేసింది. వీటిని మార్కెట్‌ ధర కంటే తక్కువకే అందుబాటులో తీసుకొచ్చింది. ప్రజలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

అన్ని లేఅవుట్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 ప్లాట్లు రిజర్వ్‌ చేయడంతోపాటు ధరలో 20 శాతం రిబేట్‌ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కొత్త నిబంధనలతో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు మొత్తం 22 జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా ప్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. లేఅవుట్స్‌ వివరాలను https:// migapdtcp. ap. gov. in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Follow Us
నాన్ వెజ్ తినేవారికి షాక్.. పెరిగిన చికెన్ ధరలు.. ఎంతో తెలుసా..?
నాన్ వెజ్ తినేవారికి షాక్.. పెరిగిన చికెన్ ధరలు.. ఎంతో తెలుసా..?
దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ, పివీ సింధు..
దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ, పివీ సింధు..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు