Andhra Pradesh: కమీషన్ అన్నారు.. ఖుషీ అయ్యాడు.. కట్ చేస్తే, రెస్టారెంట్‌కి తీసుకెళ్లి సీన్ సితార్ చేశారు..

ఆశ పడటం సహజం.. కానీ అత్యాశకు పోతే కొంపమునగడం పక్కా.. ఇలాంటి సందర్భాలను మనం ఎన్నో చూసుంటాం.. అందుకే పెద్దలు అత్యాశ వద్దురా నాయనా.. అంటూ పదే పదే చెబుతుంటారు.. తాజాగా, రూ.500 నోట్లు ఇస్తే.. పదిశాతం కమీషన్ పై రూ.2వేల నోట్లు ఇస్తామంటూ నమ్మించారు..

Andhra Pradesh: కమీషన్ అన్నారు.. ఖుషీ అయ్యాడు.. కట్ చేస్తే, రెస్టారెంట్‌కి తీసుకెళ్లి సీన్ సితార్ చేశారు..
Vizag News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 02, 2023 | 11:30 AM

ఆశ పడటం సహజం.. కానీ అత్యాశకు పోతే కొంపమునగడం పక్కా.. ఇలాంటి సందర్భాలను మనం ఎన్నో చూసుంటాం.. అందుకే పెద్దలు అత్యాశ వద్దురా నాయనా.. అంటూ పదే పదే చెబుతుంటారు.. తాజాగా, రూ.500 నోట్లు ఇస్తే.. పదిశాతం కమీషన్ పై రూ.2వేల నోట్లు ఇస్తామంటూ నమ్మించారు.. దీంతో యువకుడు ఎగిరిగెంతేసి.. ఫుల్ ఖుషీ అయిండు.. వెంటనే 12లక్షల రూపాయలు రూ.500 నోట్లు తీసుకెళ్లగా.. అసలు కథ మొదలైంది.. ఆ తర్వాత క్షణాల్లోనే కొంప కొల్లేరయ్యింది.. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని విశాఖపట్నం నగరంలో చోటుచేసుకుంది. విశాఖలో నోట్ల మార్పిడి పేరుతో భారీ టోకరా వేశారు దుండగులు. కమిషన్ ఆశ చూపి ఏకంగా 12 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లింది ముఠా. 500 రూపాయల నోట్లకు 2 వేల రూపాయల నోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు. ఇందుకు 10 శాతం కమిషన్‌ ఆశచూపారు. ఈ క్రమంలో కాకినాడకు చెందిన గంగాభవాని అనే మహిళను మధ్యవర్తిగా ఉంచారు.

ఈ దొంగ ముఠా ఆఫర్‌కు ఉబ్బితబ్బిబ్బైన శ్రీకాకుళంకు చెందిన సురేష్ 12 లక్షలు రూపాయలు 500 నోట్లు తీసుకువచ్చాడు. ఆ తర్వాత రెస్టారెంట్ కు తీసుకెళ్లారు.. మంచిగా మాట్లాడారు.. డబ్బు అంటూ రెప్పపాటులో అసలు నోట్ల స్థానంలో దుండగులు నకిలీ నోట్లు పెట్టారు. వెంటనే మస్కా కొట్టి నగదుతో పరారీ అయ్యారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..