News Watch Live: ఆరు నెలలు ఆగనక్కర లేదు కోరుకున్న వెంటనే విడాకులు..
విడాకుల మంజూరు అంశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దంపతులు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి ఇకపై అడిగిన వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలనుకుంటే..
విడాకుల మంజూరు అంశంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దంపతులు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి ఇకపై అడిగిన వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలనుకుంటే.. గతంలో 6 నెలలు వెయిటింగ్ టైమ్ ఉండేది. భార్యాభార్తలు మరోసారి పునరాలోచించుకునేందుకు విధిగా ఈ ఆరు నెలల గడువు ఇచ్చేవారు. ఆ తర్వాత కూడా విడాకులు కోరితేనే మంజూరు చేసేవారు. అయితే తాజాగా ఈ తరహా నిబంధనలను సుప్రీం కోర్టు ఎత్తివేసింది. ‘భార్యాభర్తలు విడాకుల మాటపైనే ఉంటే వెంటనే మంజూరు చేయవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించుకుని దంపతులకు విడాకులు మంజూరు చేయవచ్చని సూచించింది. ఈ మేరకు జస్టిస్ ఎస్.కే. కౌల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఈ సంచలన తీర్పు వెలువరించింది. ‘భార్యాభర్తల మధ్య దాంపత్య బంధం సరిగా లేపోతే.. ఆ కారణం కింద వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయవచ్చు. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే.. అందు కోసం ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదు. కొన్ని షరతులతో ఈ తప్పనిసరి నిరీక్షణ గడువును ఎత్తివేయొచ్చు’ అని సుప్రీం తన తీర్పులో వెలువరించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!