Shocking Incident: అనంతపురం జిల్లాలో పెను విషాదం.. ఈతకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం..

Shocking Incident: అనంతపురం జిల్లాలోని పెనుకొండలో పెను విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకుంది.

Shocking Incident: అనంతపురం జిల్లాలో పెను విషాదం.. ఈతకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం..
Family Drown
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 14, 2021 | 6:30 PM

Shocking Incident: అనంతపురం జిల్లాలోని పెనుకొండలో పెను విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకుంది. అధికారిక సమాచారం ప్రకారం.. అనంతపురం పట్టణంలోని సూర్యానగర్‌కు చెందిన నలుగురు వ్యక్తులు పెనుకొండ పరిధిలోని భోగసముద్రం చెరువులో ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వారంతా అందులో మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చెరువు నుంచి మృతదేహాలను వెలికి తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.. వారు తస్లీమా(14), సాధిక్(40), అల్లాబక్ష్(45), పాషా (17)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృత్యువాత పడటంతో సూర్యానగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also read: TS Graduation Elections: టీఆర్ఎస్‌కు పవన్ కళ్యాణ్ మద్ధతు.. తీవ్రంగా స్పందించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..

Yoga Pose Halasana : మీ దాంపత్య జీవితం శృంగార భరితం కావాలంటే ఈ ఆసనం వేయండి.. అయితే కండిషన్స్ అప్లై

AP Municipal Elections: ‘‘మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా దక్షతకు నిదర్శనం’’