CM Jagan: సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. పెరిగిన వైసీపీ ఓటు బ్యాంక్.. రాష్ట్రవ్యాప్తంగా అదే జగన్ వేవ్

రోజుల వ్యవధిలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దుమ్ము రేపింది. ఇంకా పరిషత్ ఎన్నికలే బ్యాలెన్స్ ఉన్నాయి. పంచాయతీల్లో తమ మద్దతుదారులు 85 శాతానికి పైగా...

CM Jagan: సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. పెరిగిన వైసీపీ ఓటు బ్యాంక్.. రాష్ట్రవ్యాప్తంగా అదే జగన్ వేవ్
Cm Jagan
Follow us

|

Updated on: Mar 14, 2021 | 6:17 PM

రోజుల వ్యవధిలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దుమ్ము రేపింది. ఇంకా పరిషత్ ఎన్నికలే బ్యాలెన్స్ ఉన్నాయి. పంచాయతీల్లో తమ మద్దతుదారులు 85 శాతానికి పైగా గెలిచారని వైసీపీ నేతలు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచి.. వైసీపీ జండా కప్పుకున్న నాయకుల ఫోటోల వివరాలను వెబ్ సైట్‌లో పెట్టారు. పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే… మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లు గెలిచింది.. కార్పోరేషన్లను క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపాలిటీల్లోనూ మైదుకూరు, తాటిపత్రి తప్ప మిగతా వాటన్నింటినీ సొంతం చేసుకుంది. అక్కడ ఇప్పుడు క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో సగానికిపైగా ఓటర్లు ఓటు వేశారు.

2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. వైసీపీ ఓటు బ్యాంక్ పెరిగినట్లు స్పష్టం అవుతోంది. పంచాయతీల్లో పార్టీ సింబల్ లేకున్నా.. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తు మీదనే జరిగాయి. రాష్ట్రంలో 3.94 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 3.14 కోట్లమంది ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 51 శాతం ఓట్లతో 80 శాతం సీట్లను గెలుచుకుంది. ఎన్నికలు ముగిసి ఎడాదిన్నర తర్వాత వైసీపీ మీ పాజిటివ్ ఓటు పెరిగిందనే విషయం స్పష్టం చేస్తున్నాయి తాజా ఫలితాలు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో కలిపి 77.16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీలలో 71 శాతం కార్పోరేషన్లలో 60 శాతం ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో వైసీపీ 90 శాతానికి పైగా సీట్లు సాధించింది. సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి.

సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ఓటు బ్యాంక్ తగ్గలేదు. పైగా అంతో ఇంతో పెరిగింది. టీడీపీకి వచ్చిన సీట్లు చూస్తే.. ఆ పార్టీకి ఓటు బ్యాంక్‌ సూచనలు ఏవీ కనిపించడం లేదు. టీడీపీ పోరాడిన అమరావతి ప్రాంతంతో పాటు పార్టీ ప్రముఖులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ సీట్లు గెలిచిన నగరాల్లోనూ సైకిలుకు సానుకూల ఫలితాలు రాలేదు. రాష్ట్రంలో పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లతో సగం మందికి పైగా ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న సీట్లు ఆ పార్టీ బలం పెరుగుతున్న తీరుకు నిదర్శనం.

Also Read:

Hindupur municipality: బాలయ్యకు చెక్.. హిందూపురంలో వైసీపీ ఏకపక్ష విజయం

Tadipatri Municipality: ఊరి మంచి కోసం జగన్‌ను కలిసేందుకు సిద్దం.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే