AP Municipal Election 2021 results: పారని పాచికలు.. అధినేత ప్రచారం చేసినా ఆదరణ శూన్యం

పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం తమ మద్దతుదారులే గెలిచారని ప్రచారం చేసుకున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆ లెక్కన చూసుకున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో రెండు కార్పోరేషన్లు, పాతిక పైగా మున్సిపాలిటిలు గెలవాలి.

AP Municipal Election 2021 results: పారని పాచికలు.. అధినేత ప్రచారం చేసినా ఆదరణ శూన్యం
Chandrababu
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 14, 2021 | 7:01 PM

పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం తమ మద్దతుదారులే గెలిచారని ప్రచారం చేసుకున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆ లెక్కన చూసుకున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో రెండు కార్పోరేషన్లు, పాతిక పైగా మున్సిపాలిటిలు గెలవాలి. అయితే టీడీపీ ఒక్కటంటే ఒక్క కార్పోరేషన్ కూడా సొంతం చేసుకోలేకపోయింది. ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు కార్పోరేషన్లలోనూ పార్టీ చతికిల పడింది. అమరావతిని రాజధానిగా ప్రకటించి ఆ ప్రాంతానికి ఎంత మేలు చేశామని టీడీపీ అధినేత పదే పదే చెప్పినా.. గుంటూరు, విజయవాడ కార్పోరేషన్లలో సైకిల్ టైరు పంచరైంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ బలపడిందని భావిస్తున్న ఆ పార్టీ నేతల కళ్ల పొరలు తొలగించాయి తాజా ఎన్నికలు. ఇంతగా ప్రజలు టీడీపీని ఎందుకు తిరస్కరించారు. ఎక్కడ తప్పులు జరిగాయి అనేది చూస్తే… తెలుగుదేశం ఓడిపోవడానికి ప్రధాన కారణం స్థానిక నాయకత్వంపై విశ్వాసం ఉంచలేకపోవడం. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక నాయకత్వానికి బాధ్యతలు అప్పగించడం ఎంత ముఖ్యమో.. టీడీపీ నాయకత్వానికి తెలియజెప్పాయి లోకల్ బాడీ ఎలక్షన్లు. తాడిపత్రి, మైదుకూరులో స్థానిక నేతల వ్యూహాల వల్లనే పార్టీకి ఆ మాత్రం సీట్లు వచ్చాయి.

ఎన్నికలకు ముందే టీడీపీ నేతలు ఓటమికి సిద్ధమయ్యారు. వైసీపీ పోలీసుల్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తోందని, డబ్బులు వెదజల్లుతోందని ఆరోపణలు చేసి సైలంట్ అయ్యారు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించిన తమ్ముళ్లు వాటి మీద పోరాడలేదు. కొన్ని మున్సిపాలిటీలు ఏకగ్రీవం అవుతుంటే… అక్కడ అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేని నిస్సహాయ స్థితిలో పడింది తెలుగుదేశం. స్థానిక నేతు చిత్తశుద్ధితో పని చేసని దాఖలాలు కూడా కనిపించలేదు. అన్నీ చంద్రబాబే చూసుకుంటారనే నిర్లక్ష్యం, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధినేత జోక్యం పార్టీ కొంప ముంచింది.

అధిపత్య పోరు మరో సమస్యే. విజయవాడ కార్పోరేషన్‌లో చంద్రబాబు ప్రచారానికి రావడానికి ముందు రోజే బుద్దావెంకన్న, బోండా ఉమ, నాగుల్‌ మీరా ఎంపీ కేశినేని మీద తిరుగుబాటు ప్రకటించారు. అవసరమైతే చంద్రబాబు ప్రచారానికి దూరంగా ఉంటామని ప్రకటించారు. పార్టీ కుల సంఘంగా మారుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామం విజయవాడ టీడీపీని కుదిపేసింది. పార్టీలో నలుగురు నేతలు ఉంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించడం చేటు తెచ్చింది. మిగతా నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ నేతలు చాలా మంది ఇతర పార్టీల్లో చేరారు. చాలా నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉంది. లీడర్‌షిప్ లేని చోట కొత్త వారికి బాధ్యతలు అప్పగించడం, కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం సాధించడంపై నాయకత్వం దృష్టి పెట్టలేదు. ఇది కూడా పార్టీకి చాలా నష్టం చేసింది. పంచాయతీలతో పాటు మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో హామీలు ఆచరణ సాధ్యమైనవిగా కనిపించలేదు. అన్నింటికంటే ప్రధాన లోపం ఎన్నికలకు సంబంధించి వ్యూహం లేకపోవడం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీద ఆధారపడటమే తప్ప.. పాజిటివ్ ఓటు మీద టీడీపీ దృష్టి పెట్టకపోవడం మరో మైనస్.

Also  Read: Tadipatri Municipality: ఊరి మంచి కోసం జగన్‌ను కలిసేందుకు సిద్దం.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hindupur municipality: బాలయ్యకు చెక్.. హిందూపురంలో వైసీపీ ఏకపక్ష విజయం

CM Jagan: సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. పెరిగిన వైసీపీ ఓటు బ్యాంక్.. రాష్ట్రవ్యాప్తంగా అదే జగన్ వేవ్

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..