AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..

పశ్చిమగోదావరి జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో..

Andhra Pradesh: బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
Fire Accident
Ganesh Mudavath
|

Updated on: Nov 10, 2022 | 9:08 PM

Share

పశ్చిమగోదావరి జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరికొంత మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో ఉలిక్కి పడ్డారు. పేలుడు కారణంగా భవనం ధ్వంసమైంది. మృతదేహాలు, హాహాకారాలతో ఘటనాస్థలం భీతావహంగా మారింది. చనిపోయిన వారి కుటుంబీకుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

మరో ఘటనలో.. తమిళనాడులోని మదురై క్రాకర్స్ తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 15 మందికి పైగా కార్మికులు ఉన్నారు. కొన్ని మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
కుబేరుడి చూపు మీపై పడాలంటే ఉత్తర దిశలో ఇవి ఉండాల్సిందే..
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఉన్నావ్‌ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఏపీలోని మందుబాబులకు శుభవార్త.. పనివేళల్లో మార్పులు
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఈ ఒక్క స్మార్ట్ జాకెట్ ఉంటే చాలు.. చలి గజగజ వణకాల్సిందే!
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..
ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి.. ఇంటికి తీసుకెళ్తుండగా శిశువు..