- Telugu News Photo Gallery Indian railways to redevelop visakhapatnam railway station with rs.393 crores for commercial purpose Telugu Railway station photos
Visakhapatnam Railway Station: అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకోనున్న వైజాగ్ రైల్వే స్టేషన్.. డిజైన్ అదుర్స్
దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తోంది కేంద్ర రైల్వే శాఖ. అందులో భాగంగా విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి చేయనుంది.
Updated on: Nov 10, 2022 | 9:27 PM

దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తోంది కేంద్ర రైల్వే శాఖ. అందులో భాగంగా విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి చేయనుంది.

సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌కు హెడ్‌క్వార్టర్స్‌గా విశాఖపట్నం రైల్వే స్టేషన్ మారనుంది.

రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (RLDA) రూ.393 కోట్ల విలువైన విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల కోసం బిడ్స్ ఆహ్వానిస్తోంది. 36 నెలల్లో పనులు పూర్తి చేయాలి

రైల్వేకు చెందిన భూమిని కమర్షియల్ అవసరాలకు ఉపయోగించేలా రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తోంది రైల్వే శాఖ

విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధిని తెలిపేలా భారతీయ రైల్వే డిజైన్‌ను విడుదల చేసింది.

ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ పద్ధతిలో ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నామని, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సదుపాయాలు లభిస్తాయని రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ వేద్ ప్రకాశ్ దుదేజా తెలిపారు.

మోడీ ప్రారంభించనున్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఫోటోస్
