Amalapuram Riots: అమలాపురం అల్లర్ల కేసులో వైసీపీ కీలక నేతల పై కేసులు.. దూకుడు పెంచిన పోలీసులు..
Amalapuram riots case: ఈ కేసులో వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటి వరకు 200మందికిపైగా కేసులు నమోదు చేయగా.. తాజాగా పలువురు కీలక వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మంత్రి విశ్వరూప్ అనుచరులు సత్యరుషి, వాసంశెట్టి సుభాష్, మట్టపర్తి మురళీకృష్ణ, మట్టపర్తి రఘులను నిందితులుగా చేర్చారు.
కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్ల కేసులో అరెస్టులు, కేసుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటి వరకు 200మందికిపైగా కేసులు నమోదు చేయగా.. తాజాగా పలువురు కీలక వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మంత్రి విశ్వరూప్ అనుచరులు సత్యరుషి, వాసంశెట్టి సుభాష్, మట్టపర్తి మురళీకృష్ణ, మట్టపర్తి రఘులను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో మరో నిందితుడు వీరవెంకటసత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలంతో ఈ నలుగురిపైనా కేసులు నమోదయ్యాయి. A225గా సత్య రుషి.. A226 గా వాసం శెట్టి సుభాష్… A227 గా మట్టపర్తి మురళి కృష్ణ…A228గా మట్టపర్తి రఘును పేర్కొన్నారు. ఈ నలుగురు నిందితులు కోనసీమలో మంత్రి విశ్వరూప్ అనుచరులు కాగా..వైసిపి క్రీయాశీలక నేతలుగా ఉన్నారు. నలుగురు అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం.. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
మరోవైపు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అమలాపురంలో పర్యటించారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను, కలెక్టరేట్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ కేసుల్లో ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని.. ఇప్పటివరకు 258 మంది నిందితులను గుర్తించగా.. వారిలో 142 మందిని అరెస్టు చేశామని, మరో 116 మంది కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ అల్లర్లలో పూర్తి ఆధారాలు, సీసీ ఫుటేజీ, విజువల్స్ ఆధారంగా నిందితుల గుర్తిస్తున్నామన్నారు.
కోనసీమ జిల్లా పేరు మార్పుపై గత నెల 24న ఆందోళనలు విధ్వంసానికి దారి తీసింది. కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళుతుండగా.. మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఆ తర్వాత మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేశారు.. ఇప్పటికే పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మొన్నటి వరకు ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేసిన సంగతి తెలసిందే. అమలాపురంలో పరిస్థితులన్నీ ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయి.