AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మాటలకందని విషాదం.. నాడు తల్లి, నేడు తండ్రి.. ఏం పాపం చేశారు ఈ చిన్నారులు..

‘ఇక నేను మిమ్ములను చూడటానికి రాను.. మీరు మేడమ్ వాళ్ళు చెప్పినట్టు వింటూ బాగా చదువుకోండి.’ ఇది ఓ తండ్రి సూసైడ్ చేసుకోవడానికి ముందు తన పిల్లకు చెప్పిన

Andhra Pradesh: మాటలకందని విషాదం.. నాడు తల్లి, నేడు తండ్రి.. ఏం పాపం చేశారు ఈ చిన్నారులు..
Orphans
Shiva Prajapati
|

Updated on: Jan 03, 2023 | 9:59 PM

Share

‘ఇక నేను మిమ్ములను చూడటానికి రాను.. మీరు మేడమ్ వాళ్ళు చెప్పినట్టు వింటూ బాగా చదువుకోండి.’ ఇది ఓ తండ్రి సూసైడ్ చేసుకోవడానికి ముందు తన పిల్లకు చెప్పిన ఆఖరి మాటలు. తల్లి, తండ్రి క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయం.. నలుగురు చిన్నారులను అనాధలను చేసింది. ముక్కుపచ్చలారని చిన్నారుల జీవితాలను చిద్రం చేసింది. ఇంకా ఊహ తెలియని చిన్నారులు, అభం శభం తెలియకుండా అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలియక, ఇక వస్తారో రారో తెలియక ICDS వాళ్ళ ద్వారా రాజంపేటలోని ప్రభుత్వ బాలసదన్ లో ఉంటున్నారు.

ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసాద్ బాబు, సుకన్య దంపతులు ఆరునెలల క్రితం రైల్వే కోడూరుకు వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లు, ఇద్దరు మగ పిల్లు. అందరూ చిన్నవయస్సు వారే. బేల్‌దారి పని చేసుకుంటూ ప్రసాద బాబు వీరిని పోషించు కుంటున్నాడు. అయితే, భార్య భర్తలు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే.. రెండు వారాల క్రితం ప్రసాద బాబు భార్య సుకన్య ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన ప్రసాద బాబు.. గత నెల 29న పిల్లలను స్థానిక అంగన్ వాడీ టీచర్ల ద్వారా ICDS అధికారులకు అప్పజెప్పాడు. తల్లి లేనందువల్ల తాను వారిని పోషించలేకపోతున్నాని లెటర్ రాసి ఇచ్చాడు. దాంతో అధికారులు పోలీసుల సమక్షంలో వారిని రాజంపేటలోని ప్రభుత్వ బాలసదనంలో ఉంచారు. ఈక్రమంలో కొత్త సంవత్సరం ముందు రోజు డిసెంబర్ 31న పిల్లల వద్దకు వచ్చిన ప్రసాద బాబు వారిని చివరి సారిగా చూసుకొని, వారితో మాట్లాడాడు. ఇక తాను వారిని చూడటానికి రానని, మేడమ్ వాళ్ళు చెప్పినట్లు విని బాగా చదువుకోవాలంటు వారికి చెప్పి వెళ్లాడు. సోమవారం నాడు రైల్వేకోడూరులోని రైలు నిలయం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ప్రసాద్.

తండ్రి చనిపోయాడని చెప్పలేని స్థితిలో..

చనిపోయిన తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లలు అనాధలు అవుతారని గ్రహించారో లేదో తెలియదు కాని, ముక్కుపచ్చలారని ఆ నలుగురు చిన్నారు ఏం పాపం చేశారో తెలియకుండానే అనాధలుగా మారిపోయారు. చివరికి కన్నతండ్రి చివరి చూపు కూడా వారికి దక్కలేదు. ఐశ్వర్య(9), అక్షిత(7), అరవింద్(5), అవినాష్(3)ఈ నలుగురు ప్రస్తుతం రాజంపేట బాలసదన్‌లో ఉన్నారు. ఈ విషయంపై బాలసదన్ సూపరింటెండెంట్ షోబారాణి మాట్లాడుతూ.. ప్రసాద్ చనిపోయిన విషయాన్ని పిల్లలకు చెప్పలేదని, రైలు కింద పడి చనిపోవడంతో శరీరం గుర్తుపట్టలేనంతగా మారిందన్నారు. దాంతో పిల్లలకు విషయాన్ని చెప్పలేకపోయామన్నారు. పిల్లలు తమతో బాగా కలిసిపోయారని, వారి పోషణను బాల సదన్ చూసుకుంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..