AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janasena: జీవో నెంబర్ 1 పై స్పందించిన నాగబాబు.. సంచలన కామెంట్స్ చేస్తూ ట్వీట్..

రోడ్లపై సభలు, ర్యాలీల బ్యాన్‌ జీవో.. రాజకీయ పార్టీల మధ్య అగ్గి రాజేసింది. ఓటమి భయంతోనే జగన్‌ ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందంటూ విపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు

Janasena: జీవో నెంబర్ 1 పై స్పందించిన నాగబాబు.. సంచలన కామెంట్స్ చేస్తూ ట్వీట్..
Nagababu
Shiva Prajapati
|

Updated on: Jan 03, 2023 | 10:24 PM

Share

రోడ్లపై సభలు, ర్యాలీల బ్యాన్‌ జీవో.. రాజకీయ పార్టీల మధ్య అగ్గి రాజేసింది. ఓటమి భయంతోనే జగన్‌ ప్రభుత్వం ఈ జీవో తెచ్చిందంటూ విపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ జీవోపై జనసేన పార్టీ నాయకులు నాగబాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. జీవో నెంబర్ 1 పై కోర్టుకు వెళ్తామని ప్రకటించారు. రాజకీయ పార్టీగా తమ జాగ్రత్తలు తాము తీసుకుంటామని, ప్రజలకు రక్షణ కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత అని నాగబాబు పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్‌ను ఎంత ఆపితే.. అంత లెగుస్తారని పేర్కొన్నారు నాగబాబు. జీవోను వెనక్కి తీసుకుంటే మీకే మంచిదని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు నాగబాబు.

అంతకుముందు.. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ కూడా ఈ జీవో పై తీవ్రంగా స్పందించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆంక్షలు విధిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన.. ముఖ్యమంత్రి హోదాలో బెంజి సర్కిల్లో కార్యక్రమాలు చేయలేదా? అని ప్రశ్నించారు. విశాఖలో పవన్ కళ్యాణ్ గారి నిర్బంధానికి కొనసాగింపే చీకటి జీవో అని ఆరోపించారు. రాజకీయ పార్టీలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే జీ. ఓ తీసుకువచ్చారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ అర్థరాత్రి వేళ హడావిడిగా ఉత్తర్వులు జారీ చేశారని, వైసీపీ ప్రభుత్వం తన నిరంకుశ ధోరణిని బయటపెట్టుకొందని ధ్వజమెత్తారు నాదెండ్ల. సిఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత రోజు రోజుకీ పెరుగుతోందన్నారు. ఆర్టికల్ 19ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిషేధించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించుకుందా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులు వైసీపీ పార్టీ కార్యక్రమాలకు మళ్లించేస్తున్నారని, ఇవేవీ జనజీవనాన్ని స్తంభింపచేయడం లేదా? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. శాంతిభద్రతల పేరుతో హక్కులు కాలరాయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. ప్రజా వ్యతిరేకత పెరుగుతుందనే భయం లేకపోతే చీకటి జీవో ఉపసంహరించుకొని ప్రతిపక్షాల సభలు, సమావేశాలు, ర్యాలీలకు పూర్తి భద్రత ఇవ్వాలని డిమాండ్ చేశారు నాదెండ్ల.

నాగబాబు ట్వీట్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..