Sabbam Hari: అంచెలంచెలుగా ఎదిగిన టీడీపీ నేత సబ్బం హరి.. అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా రాణించిన మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత టీడీపీ నేత సబ్బం హరి కన్నుమూశారు.

Sabbam Hari: అంచెలంచెలుగా ఎదిగిన టీడీపీ నేత సబ్బం హరి.. అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూత
Sabbam Hari
Follow us
Balaraju Goud

|

Updated on: May 03, 2021 | 3:28 PM

Former MP Sabbam Hari Dies: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా రాణించిన మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత టీడీపీ నేత సబ్బం హరి కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించటంతో కొద్దిరోజులుగా వెంటిలేటర్ పై ఉంటూ చికిత్స తీసుకుంటున్న ఆయన. సోమవారం మధ్యహ్నం తుది శ్వాస విడిచారు.

జూన్ 1, 1952 న విశాఖపట్నంలో జన్మించాడు. తగరపువలస సమీపంలోని చిట్టివలస ఇతడి సొంతూరు. నాన్న బంగారునాయుడు. అమ్మ అచ్చియ్యమ్మ. ఆరుగురి తర్వాత ఆఖరివాడు సబ్బం హరి. ఇతడు. సొంతూరులోనే పాఠశాల చదువు పూర్తిచేసి ఇంటర్‌ ఏవీఎన కళాశాలలో పూర్తి చేశారు. అక్కడే డిగ్రీ పట్టబద్రులయ్యారు.

కాంగ్రెస్‌ నేతలు ద్రోణంరాజు సత్యనారాయణ, సూర్రెడ్డి, గుడివాడ గురునాథరావుల ,చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు సబ్బం హరి. అప్పోజీరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన విశాఖ నగర కాంగ్రెస్‌ కమిటీలో కార్యదర్శిగా పనిచేశారు. అలా రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చాడు. తర్వాత నగర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షునిగా నియమితుడయ్యాడు. నగర కాంగ్రెస్‌ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ అనతికాలంలోనే గుర్తింపు పొందాడు. కాంగ్రెస్ అధిష్టానం అతడి సేవలను గుర్తించి 1989లో టికెట్‌ ఇవ్వజూపింది. తనకు వద్దని చెప్పి గురునాథరావు, సూర్రెడ్డి, ఈటి విజయలక్ష్మిలకు ఇవ్వాలన్నాడు. వారిని గెలిపించాడు. 1995లో కాంగ్రెస్ పార్టీ తరుఫున గెలుపొంది విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌‌గా గెలుపొందారు. అవినీతి ఆరోపణలు లేకుండా మచ్చలేని నాయకుడిగా ఎదిగారు. అతడి హయాంలోనే పారిశుధ్యాన్ని ప్రైవేటీకరణ చేసిన తొలినగరంగా విశాఖపట్నం నిలిచింది.

సబ్బం హరి విశాఖపట్నం మేయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో అన‌కాప‌ల్లి ఎంపీగా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌కు ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌తో వైఎస్ జగన్ విభేదించిన సమయంలో ఆయనతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించిన వ్యక్తిగా సబ్బం హరి నిలిచారు. వైసీపీకి అండగా ఉంటూ కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించారు. జగన్‌కు పూర్తి అండగా నిలిచారు. ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్ వెంట నిలిచారు. అయితే ఆ తరువాత పరిణామాలు మారిపోయాయి. వైఎస్ జగన్‌తో విభేదాలు రావడంతో సబ్బం హరి ఆయనకు దూరమయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం కొంతకాలం రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన సబ్బం హరి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణను సబ్బం హరి పూర్తిగా వ్యతిరేకించారు. సీఎం జగన్ తీరును పూర్తిగా వ్యతిరేకించారు.

1970 అక్టోబరు 15 న లక్ష్మితో సబ్బం హరి ప్రేమ వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. అవని, అర్చన, వెంకట్‌. ఆడపిల్లలకు పెళ్ళిళ్లయ్యాయి. కుమారుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. రాజకీయాలకు దూరంగా వారిని పెంచాడు సబ్బం హరి.

Read Also…. Breaking News: కరోనాతో మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత..