AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oxygen Shortage: కరోనా మరణమృదంగం.. ఆక్సిజన్ కొరతతో.. హిందూపురంలో 8 మంది రోగుల మృత్యువాత..!

Oxygen Shortage in AP: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. ఈ క్రమంలో

Oxygen Shortage: కరోనా మరణమృదంగం.. ఆక్సిజన్ కొరతతో.. హిందూపురంలో 8 మంది రోగుల మృత్యువాత..!
Oxygen Shortage
Shaik Madar Saheb
|

Updated on: May 03, 2021 | 4:56 PM

Share

Oxygen Shortage in AP: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతతో చాలామంది రోగులు మృత్యువాతపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల గుంటూరు, విజయనగరం ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక పలువురు రోగులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరచిపోక ముందే తాజాగా అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఎనిమిది మంది కరోనా రోగులు మరణించారు. అయితే వీరంతా ఆక్సిజన్ అందకనే మరణించారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారంతా ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.

కాగా.. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ దివాకర్ బాబు స్పందించారు. ఉదయం ఐదు గంటల సమయంలో ఆక్సిజన్ ఆగిపోయిన మాట వాప్తవమని వెల్లడించారు. మొదట ఆక్సిజన్ అందక ముగ్గురు చనిపోయారని తెలిపారు. మిగతా వారంతా భయంతో చనిపోయారని తెలిపారు. క్రిటికల్ పొజిషన్‌లో చికిత్స పొందుతున్నారని.. ఈ సమయంలో మరణిాంచారని వివరించారు. కాగా.. మృతుల బంధువులు ఆందోళన నిర్వహించడంతో.. పోలీసులను భారీగా మోహరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

NEET PG Exams: కరోనా ఎఫెక్ట్… నీట్ 2021 పరీక్షలు మరో నాలుగు నెలలు వాయిదా..!

Abhishek Banerjee: తృణమూల్ విజయం వెనుక శక్తి అతనే.. మేనత్తకు అండగా మేనల్లుడు