Pushpa 2: అరచేతిని అడ్డుపెట్టి పుష్ప సినిమాను ఆపలేరు: అంబటి రాంబాబు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కేసులు దుమారం కొనసాగుతోంది. తమ కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, ఎన్టీఆర్‌ల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Pushpa 2: అరచేతిని అడ్డుపెట్టి పుష్ప సినిమాను ఆపలేరు: అంబటి రాంబాబు
Ambati Rambabu Pushpa 2
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 25, 2024 | 12:43 PM

వైసీపీ నేతలు అంబటి రాంబాబు, డైమండ్ బాబు ఎస్పీని కలిశారు.  సోషల్ మీడియాలో వైసీపీ నేతలను అసభ్యకరంగా దూషిస్తున్న వారిపై చేసిన ఫిర్యాదుల విషయంలో ఎంత మేరకు చర్యలు తీసుకున్నారో తెలపాలన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఐటి యాక్ట్ కింద పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ వాళ్లు అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టినా అరెస్ట్ చేస్తామని నీతి వాఖ్యాలు చెప్పిన చంద్రబాబు.. చర్యలు విషయంలో మాత్రం ఎలాంటి పనితనం చూపడం లేదన్నారు. ఫిర్యాదులపై అన్ని పోలీస్ స్టేషన్స్‌కు వెళ్లి.. ఏం చర్యలు తీసుకున్నారో ప్రశ్నించామని..  స్పష్టమైన సమాధానం రాలేదన్నారు. వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నప్పుడు.. టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరో చెప్పాలన్నారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంన్నారు అంబటి. పోలీసులు స్పందించకుంటే న్యాయ స్థానాల్ని ఆశ్రయిస్తామన్నారు. స్పీకరైనా, మంత్రైనా.. సామాన్యుడైనా చట్టం దృష్టిలో ఒకటే అని చెప్పారు.  జమిలి ఎన్నికలొస్తాయన్న ప్రచారం జరుగుతోందని.. అధికారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

పుష్ప 2 ను ఎవరూ అడ్డుకోలేరు…..

రెడ్ బుక్ లోకేష్ రాశాడని.. అదే అతనికి శాపంగా మారుతుంది అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.  రెడ్ బుక్ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతాడని వ్యాఖ్యానించారు.  అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చూడకుండా ఎవరూ ఆపలేరని..  అరచేతిని అడ్డు పెట్టి ఆ సినిమాను ఆపే సత్తా ఎవరికీ లేదన్నారు. తాను కూడా సినిమా చూడటానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు అంబటి.  మొదటి పార్ట్ అద్భుతంగా ఉందని చెప్పారు. పుష్ప-2 పై కొంతమందికి జెలసీగా ఉందని..  ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ను బహిష్కరించాలనుకోవడం అవివేకం అని వ్యాఖ్యానించారు అంబటి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..