Ambati Rayudu: పొలిటికల్ ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చిన అంబటి రాయుడు.. ఏమన్నారంటే.

మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు తన రాజకీయ ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత అంబటి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ పార్టీ ద్వారా అంబటి రాయుడు తన పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో రాయుడు చేసిన వ్యాఖ్యలు...

Ambati Rayudu: పొలిటికల్ ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చిన అంబటి రాయుడు.. ఏమన్నారంటే.
Ambati Rayudu
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 16, 2023 | 9:41 PM

మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు తన రాజకీయ ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత అంబటి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ పార్టీ ద్వారా అంబటి రాయుడు తన పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో రాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వార్తలకు ఊతమిచ్చినట్లయ్యాయి. అయితే తాను రాజకీయాల్లోకి రావట్లేదని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఈ వార్తలకు చెక్‌ పడలేదు.

అయితే తాజాగా ఆదివారం మంగళగిరిలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ను సందర్శించిన అంబటి రాయుడు మరోసారి తన రాజకీయ ప్రవేశంపై మాట్లాడారు. తాను ఇంకా ఏపార్టీలో చేరలేదని తేల్చి చెప్పారు. క్రికెట్‌ అకాడమీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు అంబటి చెప్పుకొచ్చారు. అక్షయపాత్ర గురించి మాట్లాడిన అంబటి.. అక్షయ పాత్ర ద్వారా పిల్లలకు ఆహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఐపీఎల్‌ జట్టు కోసం కృషి చేస్తానని అంబటి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..