KA Paul: కేఏ పాల్‌పై విష ప్రయోగం అంటూ సోషల్ మీడియాలో ఆడియో కలకలం..

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేరుతో ఒక ఆడియో లీక్ అయింది. ఆయనకు గ్లోబల్‌ పీస్‌ మేకర్‌గా పేరుంది. అప్పుడప్పుడూ ప్రపంచ దేశాల అధ్యక్షులందరూ తనకు తెలుసని తెగ సందడి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తనను చంపాలని చూస్తున్నారంటూ.. కేఏ పాల్ మాట్లాడినట్లు ఆ ఆడియోలో ఉంది. డిసెంబర్ 25న ఫుడ్ పాయిజన్‌తో తనను చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు.

KA Paul: కేఏ పాల్‌పై విష ప్రయోగం అంటూ సోషల్ మీడియాలో ఆడియో కలకలం..
Ka Paul
Follow us

|

Updated on: Jan 05, 2024 | 7:09 PM

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేరుతో ఒక ఆడియో లీక్ అయింది. ఆయనకు గ్లోబల్‌ పీస్‌ మేకర్‌గా పేరుంది. అప్పుడప్పుడూ ప్రపంచ దేశాల అధ్యక్షులందరూ తనకు తెలుసని తెగ సందడి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తనను చంపాలని చూస్తున్నారంటూ.. కేఏ పాల్ మాట్లాడినట్లు ఆ ఆడియోలో ఉంది. డిసెంబర్ 25న ఫుడ్ పాయిజన్‌తో తనను చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఎవరు చేశారన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఫుడ్ పాయిజన్ కారణంగా ఎవరికీ చెప్పకుండా తాను విశాఖలో చికిత్స పొందుతున్నట్లు కేఏ పాల్ తన ఆడియోలో చెబుతున్నారు. విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని చెప్పారు. ఫుడ్ పాయిజనింగ్ తర్వాత ప్రస్తుతం కోలుకుంటున్నానని.. దేవుడి దయ వల్ల ప్రాణాలతో బతికి బయటపడ్డానంటూ చెప్పుకొచ్చారు.

ఈ విషయం బయటకు చెప్పొచ్చో లేదోనని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నట్లు తెలిపారు. పది రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నానన్నారు. రాజకీయ కుట్రలతో తనపై హత్యాయత్నం జరిగిందని కేఏ పాల్ చెప్పినట్లుగా ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇలా తనపై విష ప్రయోగం జరిగిందని కేఏ పాల్ పేరుతో ఆడియో లీక్ కావడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. మెడికో ప్రీతి కేసు మొదలు గత ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించినందుకు తనను టార్గెట్‌ చేశారని అనేక సార్లు మీడియా ముందుకు వచ్చారు. చాలా కాలం గ్యాప్ తరువాత తిరిగి మరోసారి విషప్రయోగం అంటూ ఆడియో వైరల్‌గా మారడం చర్చనీయాంశమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..