Krishna District: గుడిలో రాత్రిళ్లు నిద్రిస్తున్న అర్చకుడు.. సీసీ ఫుటేజ్ చూస్తే.. ఇదేం పని
స్థానికంగా గ్రామ దేవత దేవాలయం ఉంది.. అక్కడ పని చేసే అర్చకులు.. వంతులు వేసుకుని రాత్రి వేళల్లో ఆయలంలో కాపలాగా నిద్రిస్తారు. ఈ క్రమంలో ఒక పూజారి వంతు కాగా.. అతడి పెదనాన్న కుమారుడు తాను పడుకుంటానని చెప్పడంతో సరే అన్నారు. దీంతో ఆ వ్యక్తి కొద్ది రోజులుగా కాపలాదారుగా ఆలయంలో నిద్రిస్తున్నాడు.
పూజారులు, అర్చకులు అంటే.. నిత్యం దైవ సన్నిధిలో మెలిగేవారు.. యాగాలు, హోమాలు నిర్వహించేవారు. అలాంటివారు ఎంతో ఒద్దికతో ఉండాలి. అయితే.. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఓ అర్చకుడు దారి తప్పాడు. ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే విషయం ఎక్కువకాలం దాగలేదు. అడ్డండా బుక్కయ్యి ఇప్పుడు తల దించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా గ్రామ దేవత దేవాలయం ఉంది.. అక్కడ పని చేసే అర్చకులు.. వంతులు వేసుకుని రాత్రి వేళల్లో ఆయలంలో కాపలాగా నిద్రిస్తారు. ఈ క్రమంలో ఒక పూజారి వంతు కాగా.. అతడి పెదనాన్న కుమారుడు తాను పడుకుంటానని చెప్పడంతో సరే అన్నారు. దీంతో ఆ వ్యక్తి కొద్ది రోజులుగా కాపలాదారుగా ఆలయంలో నిద్రిస్తున్నాడు.
అయితే సరిగ్గా ఇదే సమయంలో ఆలయంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు మాయమవుతున్నాయని ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌కు కొందరు వ్యక్తులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీంతో స్థానిక పోలీసులు టెంపుల్‌లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. డిసెంబర్ 28, 30 తేదీల్లో సదరు అర్చకుడు హుండీ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాపై ఓ వస్త్రాన్ని వేసి ఒక ఇనుప రాడ్డుకి అయస్కాంతం తగిలించి హుండీలోని డబ్బును చోరీ చేసినట్లు గుర్తించారు. 2023 అక్టోబర్ 5న హుండీలు తెరిచి కానుకల్ని లెక్కించారు. అప్పటి నుంచి భక్తులు వేసిన కానుకలు హుండీలో ఉన్నట్లు కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. అతడు మొత్తం ఎంత నగదు దొంగిలించాడన్నది తేలాల్సి ఉంది.
గతంలో ఇదే ఆలయంలో ఒక అర్చకుడు అమ్మవారి ఆభరణాలు చోరీ చేశాడు. అది రుజువు కావడంతో అతడ్ని తొలగించారు. ఇప్పుడు మళ్లీ హుండీలో చోరీ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. అయితే అర్చకుడు చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.