Watch Video: మా హయాంలోనే బీసీలకు న్యాయం.. ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్

Watch Video: మా హయాంలోనే బీసీలకు న్యాయం.. ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్

Janardhan Veluru

|

Updated on: Jan 05, 2024 | 1:21 PM

టీడీపీ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఆ పార్టీకి చెందిన రేపల్లె MLA అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. వైసీపీ పాలనలో బీసీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఉద్యమాల పేరిట ఆర్‌.కృష్ణయ్య బీసీలను మోసం చేశారని ఆరోపించారు. ఎవరి హయాంలో బీసీలకు న్యాయం జరిగిందో ఆర్‌.కృష్ణయ్య చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

జగన్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందంటూ విజయవాడలో జరిగిన బీసీ కులాల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఘాటుగా స్పందించింది. టీడీపీ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఆ పార్టీకి చెందిన రేపల్లె MLA అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. వైసీపీ పాలనలో బీసీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఉద్యమాల పేరిట ఆర్‌.కృష్ణయ్య బీసీలను మోసం చేశారని ఆరోపించారు. ఎవరి హయాంలో బీసీలకు న్యాయం జరిగిందో ఆర్‌.కృష్ణయ్య చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ఇంకా ఆయన ఏమన్నారో వీడియోలో చూడండి..

చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించిన ఆర్. కృష్ణయ్య.. జగన్ ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బీసీలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. జగన్ పాలనలోనే బడుగుల బతుకులు మారాయని అన్నారు. 45 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో జగన్‌లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల మేలు కోరే జగన్ వంటి నాయకుడిని చూడలేదని ఆయన పేర్కొన్నారు.