Sattenapalle: గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్.. వాంతులు, విరోచనాలతో.. ఒకరి తర్వాత మరొకరు..

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. మండలంలోని రామకృష్ణాపురం డా.బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుతున్న..

Sattenapalle: గురుకుల పాఠశాలలో పుడ్ పాయిజన్.. వాంతులు, విరోచనాలతో.. ఒకరి తర్వాత మరొకరు..
Food Poisoning
Follow us

|

Updated on: Jan 30, 2023 | 8:35 PM

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. మండలంలోని రామకృష్ణాపురం డా.బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుతున్న 130 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం ఆహారం తీసుకున్న బాలికలు వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడ్డారు. దీంతో విద్యార్థినులను హుటాహుటిన సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యసేవలు అందుతున్నాయి. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్న ఆయన.. పరిస్థితి చక్కబడుతుందని ధైర్యం చెప్పారు. వైద్య సిబ్బందిని ఎక్కువ మందిని పిలిపించి వైద్యం చేయిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై సత్తెనపల్లి ఆర్డీఓ రాజకుమారి విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..