Tarakaratna: ఇంకా విషమంగానే తారక రత్న ఆరోగ్యం.. తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు.
లోకేశ్ పాద యాత్రలో పాల్గొన్న నందమూరి తారక రత్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు తారక రత్న. అయితే తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే...
లోకేశ్ పాద యాత్రలో పాల్గొన్న నందమూరి తారక రత్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు తారక రత్న. అయితే తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వైద్యులు హెల్త్ బులెటెన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వైద్యులు తారక రత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు.
అయితే తారక రత్నకు ఎక్మో సపోర్ట్‌తో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారని వస్తున్న వార్తలపై కూడా వైద్యులు స్పందించారు. ఆయనకు ఎక్మో సపోర్ట్ పెట్టలేదని తేల్చి చెప్పారు. సాయంత్రం 6 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో వైద్యులు ఈ వివరాలను వెల్లడించారు. ఆసుపత్రి వద్ద ప్రజలు, అభిమానులు ప్రైవసీ కల్పించాలని, చికిత్సకు ఎలాంటి అంతరాయం కల్పించకూడదని వైద్యులు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే అంతకు ముందు తారక రత్న బాబాయ్ నందమూరి రామకృష్ణ మాత్రం.. తనకు తానుగా శ్వాస తీసుకుంటున్నారని.. ఆర్గాన్స్ అన్నీ బాగున్నట్లు వివరించిన విషయం తెలిసిందే. అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయని తెలిపారు. తారకరత్న ప్రజంట్ వెంటిలేటర్‌పై ఉన్నారని.. మధ్యాహ్నం 1:30 గంటలకు సీటీ స్కాన్ తీశారని.. ఆ రిపోర్ట్ వచ్చాక మెదడు పనితీరు తెలుస్తుందని వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..