AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.. కథ మామూలుగా లేదుగా..

రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది.. రోజుకో ఎపిసోడ్ బయటికి వస్తుంది నిన్నటి వరకు తనను లైంగికంగా వేధించాడు అని ఆరోపించిన హర్ష వీణ.. ఈరోజు అరవ శ్రీధర్ వ్యవహారంలో ఒక అడుగు ముందుకేసింది. మరో ఇద్దరు అమ్మాయిలతో సంబంధం ఉంది అని చెబుతూ వారితో చేసిన చాటింగ్ లను బయటపెట్టింది.

Andhra: ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.. కథ మామూలుగా లేదుగా..
Railway Kodur Mla Arava Sridhar Issue
Shaik Madar Saheb
|

Updated on: Feb 06, 2026 | 6:51 PM

Share

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైకి కనిపించేంత అమాయుకుడు కాదని, తన ఖాతాలో చాలామంది అమ్మాయిలు ఉన్నారంటూ మరో బాంబ్ పేల్చింది బాధితురాలు వీణ. ఆయనకు ఇద్దరు కాదు, ఆరుగురు అంటూ హింట్ ఇచ్చింది వీణ.. బాధితురాలు వీణ ఇలా రోజుకో బ్రేకింగ్, పూటకో వీడియో చొప్పున అగ్గి రాజేస్తుంటే, అరవ శ్రీధర్ వర్గం కూడా అదే రేంజ్‌లో రివర్స్ అటాక్‌ మొదలు పెట్టింది. టోటల్ ఎపిసోడ్ వన్‌సైడ్‌గా వెళ్తున్న సమయంలో 25కోట్ల రూపాయల ఆడియో లీక్‌కావడంతో ఇష్యూ మరో టర్న్ తీసుకుంది. 18నెలల్లో 5 అబార్షన్లంటూ బాధితురాలు చెప్పడం కూడా వివాదాస్పదమైంది. ఆరోపణలే కాదు, ఆరోపణలను రుజువు చేసే పక్కా ఆధారాలున్నాయంటూ బాంబ్ పేల్చింది వీణ..

మరో వీడియో విడుదల..

ఈ క్రమంలోనే.. రైల్వేకోడూరు MLA అరవ శ్రీధర్‌పై వీణ కొత్త వీడయో విడుదల చేసింది. ఇవాళ ఒక చాటింగ్‌ను, మరో వీడియోను విడుదల చేసిన వీణ.. MLA శ్రీధర్‌తో కారులో వెళుతున్న వీడియోను బయటపెట్టింది. శ్రీధర్‌ అనుమతితోనే చాటింగ్‌లు, వీడియోలు రికార్డుచేశానని.. వీణ మరోసారి తెలిపింది. తన దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయంటున్న బాధితురాలు.. జనసేన త్రిసభ్య కమిటీ ముందు తన వాదనలు వినిపిస్తానని తెలిపింది.

మరోవైపు తనపై వస్తున్న విమర్శలకూ సాలిడ్ ఆన్సర్ ఇస్తున్నారు వీణ.. 18నెలల్లో 5 అబార్షన్లు. అసలిదెలా సాధ్యమంటూ వీణపై పలు విమర్శలు వచ్చాయి. దానిపైనా వివరణ ఇస్తూ,తనకు జరిగింది అబార్షన్ కాదని, అబార్టెడ్ చేయించుకున్నానని తెలిపింది. అంటే గర్బం వచ్చిందని తెలియగానే టాబ్లెట్స్ తీసుకుని గర్భం రాకుండా చేసుకున్నానన్నది బాధితురాలి వెర్షన్. 25కోట్లు తాను అడగలేదని, అసలా వాయిస్సే తనది కాదంటున్నారు వీణ.

మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను ఆ పార్టీ త్రిసభ్య కమిటీ సుమారు 7 గంటల పాటు విచారించింది. ఎమ్మెల్యే శ్రీధర్​తోపాటు 40 మంది పార్టీ కార్యకర్తలూ విచారణకు హాజరయ్యారు. ఈ వివాదంలో ఎమ్మెల్యేతో పాటు బాధిత మహిళపైనా పరస్పర కేసులు నమోదయ్యాయి. కమిటీ సభ్యులైన శివశంకర్ రావు, టీసీ. వరుణ్, రమాదేవి రైల్వేకోడూరులో ఓ కన్వెన్షన్ సెంటర్​లో శ్రీధర్‌ను విచారించారు. వివాదానికి సంబంధించి తన వద్దనున్న ఆధారాలను కమిటీకి అందజేసినట్లు ఎమ్మెల్యే శ్రీధర్ తెలిపారు.

మరోవైపు జనసేన కమిటీ తననూ కాంటాక్ట్ చేసిందని, త్వరలో కమిటీకి తన వెర్షన్‌తోపాటు ఆధారాలిస్తామంటున్నారు వీణ. సో…అటు అరవ శ్రీధర్..ఇటు వీణ, ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపించుకోవడమేకాదు, ఆధారాలతో నిరూపిస్తామంటున్నారు. మరి టోటల్ ఇష్యూలో ఎవరు బాధితులు, ఎవరు బాధ్యులు అన్నది తేలాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us