AP Backlog Jobs 2023: రూ.లక్షకుపైగా జీతంతో ఆంధ్రప్రదేశ్‌లో బ్యాగ్‌లాగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Jan 30, 2023 | 6:57 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) 2022-23 సంవత్సరానికి గానూ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి..

AP Backlog Jobs 2023: రూ.లక్షకుపైగా జీతంతో ఆంధ్రప్రదేశ్‌లో బ్యాగ్‌లాగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే ప్రభుత్వ ఉద్యోగం గ్యారెంటీ..
Andhra Pradesh
Follow us

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) 2022-23 సంవత్సరానికి గానూ బ్యాక్‌లాగ్ (మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(పురుషులు మాత్రమే)/జూనియర్ టెక్నికల్ ఆఫీసర్/ఫౌంటెన్ క్లీనర్/బోర్ వెల్ క్లీనర్/వాచ్‌మెన్) పోస్టుల భర్తీకి అర్హులైన వికలాంగ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీహెచ్‌ఏ (ఎం) కోర్సు, ఇంటర్ ఒకేషనల్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ-ఎం), డిప్లొమా(సివిల్ ఇంజనీరింగ్‌) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 9, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌లో అప్లికేషన్లను సమర్పించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయసు, వైకల్యం పర్సెంట్‌, ఎంప్లాయిమెంట్‌ సీనియారిటీ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.1,18,390ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

Assistant Director, Welfare of Differently Abled, TG & Sr Citizens, Ambedkhar Bhavan, New Collectorate, Chittoor, AP.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu