Fire Accident: వైజాగ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం
విశాఖపట్నం జగదాంబ జంక్షన్‌లో ఉన్న ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. రెండవ అంతుస్తులోని ఆపరేషన్ థియేటర్‌లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మంటల్లో పలువురు రోగులు చిక్కుకున్నారు. కొందరు భయంతో పరుగులు తీస్తుంటే మరికొంత మందిని ఆస్పత్రి సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

విశాఖపట్నం జగదాంబ జంక్షన్‌లో ఉన్న ఇండస్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. రెండవ అంతుస్తులోని ఆపరేషన్ థియేటర్‌లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. మంటల్లో పలువురు రోగులు చిక్కుకున్నారు. కొందరు భయంతో పరుగులు తీస్తుంటే మరికొంత మందిని ఆస్పత్రి సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన వారిని దగ్గరలోని వేరొక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి పరిసరాల్లో దట్టంగా పొగ అలముకుంది. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. దట్టంగా కమ్ముకున్న పొగను బయటకు పంపించేందుకు అక్కడి విండో అద్దాలను ఆసుప్రతి సెక్యూరిటీ సిబ్బంది పగుల గొట్టారు. షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని ఎమ్మార్వో తెలిపారు. జీవీఎంసీ అధికారులు కూడా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని గమనిస్తున్నారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అడిషనల్ జీవీఎంసీ కమిషనర్. రోగుల బంధువులు, పోలీసులు, స్థానిక ప్రజలు గుమిగూడటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.
మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పొగలో చిక్కుకున్న రోగులు కాసేపు ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆసుపత్రి మంటల్లో చిక్కుకున్న అందరినీ బయటకు తీసుకొచ్చారు అసుపత్రి సిబ్బంది. నైట్రస్ ఆక్సైడ్ కారణంగా సిలిండర్ పేలి ఆపరేషన్ థియేటర్లో ముందుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఐసీయూలో ఉన్న ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో దగ్గర్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ థియేటర్లో మొత్తం 47 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని చెబుతున్నారు. మంటల్లో గాయాలైన వారికి చికిత్స అందించేందుకు దగ్గర్లోని వేరే అసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. అసుపత్రికి రెవిన్యూ, పోలీసు అధికారులు చేరుకున్నారు. పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటున్నాయి అసుప్రతి వర్గాలు.
పూర్తి వీడియో..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




