Central Team Visit: పంట నష్టంపై అధికారుల అంచనాలు.. ఏపీలో రెండో రోజు కేంద్ర బృందం పర్యటన
మిచౌంగ్ తుఫాను ఏపీ కోస్తా తీరానికి సమాంతరంగా పయనించడం వలన ఇంతకు ముందెన్నడూలేని విధంగా 19 జిల్లాల్లో ప్రభావం చూపింది. దీంతో సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్ కేంద్ర బృందాన్ని కోరారు. అయా జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అధికారులకు వివరించారు.

మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు వచ్చింది కేంద్ర బృందం. సెంట్రల్ పర్యటనలో భాగంగా రెండో రోజు విపత్తుల సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్ , మేనేజింగ్ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్, అగ్రికల్చరల్ కమిషనర్ సిహెచ్ హరికిరణ్, హార్టికల్చరల్ కమిషనర్ డా.శ్రీధర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
మిచౌంగ్ తుఫాను ఏపీ కోస్తా తీరానికి సమాంతరంగా పయనించడం వలన ఇంతకు ముందెన్నడూలేని విధంగా 19 జిల్లాల్లో ప్రభావం చూపింది. దీంతో సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్ కేంద్ర బృందాన్ని కోరారు. అయా జిల్లాల్లో జరిగిన నష్టాన్ని అధికారులకు వివరించారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుంది. నిన్నటి అధికారుల సమావేశంలో కేంద్రబృందం టీమ్ లీడర్ రాజేంద్ర రత్నూ తుఫానుతో తీవ్రంగా ప్రభావితమైన 4 జిల్లాల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. పూర్తిస్థాయి కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి, వీలైనంత మేర ఆదుకోవడానకి తమ వంతు సహకారాన్ని అందిస్తామని అన్నారు రాజేంద్ర రత్నూ.
రాష్ట్రంలో తుఫాను వల్ల కలిగిన నష్టాల్ని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కేంద్ర బృందానికి వివరించారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టానికి సంభందించి మధ్యంతర నివేదిక అందించారు. శాఖాపరంగా ఆర్ & బీలో రూ.2641కోట్లు, వ్యవసాయ శాఖలో రూ.703కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో రూ.100 కోట్లు, హార్టికల్చర్ విభాగంలో రూ86.97 కోట్లు మేర, ఇతర శాఖల్లో ఎక్కువగానే నష్టం వచ్చిందనీ చెప్పారు. మొత్తంగా మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వాటి పునరుద్ధరణకు రూ.3,711 కోట్లు సాయం అందించాలని మధ్యంతర నివేదికలో కోరారు…
పర్యటనకు వచ్చిన కేంద్ర బృందం బుధవారం కృష్ణా, బాపట్ల జిల్లాలో పర్యటించగా, గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాలో పర్యటించారు. పర్యటన అనంతరం పంట నష్టంపై కేంద్రానికి పూర్తి స్థాయి నివేదిక అందించనున్నారు.
మరోవైపు “ఆడుదాం.. ఆంద్ర” గ్రామీణ క్రీడల పోటీలను ప్రభుత్వం డిసంబర్ 26 కి వాయిదా వేసింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాలలో పంటల నష్టాలపై సర్వేలు జరుగుతున్నా కారణంగా.. ఈ క్రీడా పోటీలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…