AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జగన్‎కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదు’.. మంత్రి పయ్యావుల కేశవ్..

ప్రజలు జగన్‎కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని నిర్ణయించారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. అధికార పార్టీగా తాము హుందాగానే వ్యవహరించి మంత్రులతో పాటు ప్రమాణం చేయించామన్నారు ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారు సూచనల మేరకే రాశారా అని ప్రశ్నించారు.? సలహాదారుల సలహాలు తీసుకుంటే మునిగి పోతారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుర్తించాలని సూచించారు. జగన్ కేవలం మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాదు శాసన సభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే పుస్తకాలు చదవాలన్నారు.

'జగన్‎కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదు'.. మంత్రి పయ్యావుల కేశవ్..
Minister Payyavula Keshav
Srikar T
|

Updated on: Jun 26, 2024 | 2:48 PM

Share

ప్రజలు జగన్‎కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని నిర్ణయించారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. అధికార పార్టీగా తాము హుందాగానే వ్యవహరించి మంత్రులతో పాటు ప్రమాణం చేయించామన్నారు ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారు సూచనల మేరకే రాశారా అని ప్రశ్నించారు.? సలహాదారుల సలహాలు తీసుకుంటే మునిగి పోతారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుర్తించాలని సూచించారు. జగన్ కేవలం మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాదు శాసన సభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే పుస్తకాలు చదవాలన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా లేదు.. అందుకే జగన్ ప్రతిపక్ష నాయకుడు కాదని తెలిపారు. జగన్ కేవలం ఫ్లోర్ లీడర్ మాత్రమే అని తెలిపారు. ఓనమాలు కూడా చూడకుండా స్పీకర్‎కు లేఖ ఎలా రాశారని ప్రశ్నించారు.

దేశ వ్యాప్తంగా అన్ని శాసనసభలు అలాగే పార్లమెంటు పాటించే నిబంధనలు జగన్ తెలుసుకోవాలని కోరుతున్నాం అన్నారు. ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలన్న దానిపై తొలి స్పీకర్ మల్వంకర్ నిర్దేశించారన్నారు. 10 శాతం కూడా సభ్యులు లేకుండా హోదా ఎలా వస్తుందని అడిగారు. గత శాసనసభలో జగన్ తన నోటితోనే చెప్పారని గుర్తు చేశారు. అసెంబ్లీలో అన్ని పార్టీల మాదిరిగానే జగన్ కూడా ఫ్లోర్ లీడర్‎గానే ఉంటారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు ప్రకారం జగన్‎కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదని తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా రావడానికి జగన్‎కు ఓ పదేళ్ల సమయం పడుతుందని ఎద్దేవాచేశారు. జగన్‎కు ఆప్తుడైన కేసిఆర్ కూడా తెలంగాణ అసెంబ్లీ‎లో కాంగ్రెస్‎కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. స్పీకర్‎కు లేఖ రాసి జగన్ బెదిరించే ప్రయత్నం చేశారన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…