Andhra Pradesh: రాజకీయ ప్రకంపనలు రేపుతోన్న ఫైల్స్‌ దగ్ధం ఇష్యూ.. తెరపైకి ఎన్నో సందేహాలు

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల దగ్ధం వ్యవహారం రిపీట్ అవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దగ్ధం కేసు మరవకముందే తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఫైల్స్ దగ్ధం కావడం చర్చగా మారింది. గత నెల 21 అర్ధరాత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది...

Andhra Pradesh: రాజకీయ ప్రకంపనలు రేపుతోన్న ఫైల్స్‌ దగ్ధం ఇష్యూ.. తెరపైకి ఎన్నో సందేహాలు
Andhra Pradesh
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Aug 19, 2024 | 9:36 AM

ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ దగ్ధం ఇప్పుడు కామన్ అయ్యింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వరుస ఘటనలు ఇందుకు నిదర్శనమైంది. మొన్న మదనపల్లి ఇప్పుడు టీటీడీలో ఫైల్స్ దగ్ధం వ్యవహారం ఆసక్తిగా మారింది. రాజకీయ దుమారం రేపుతోంది. ఫైల్స్ దగ్ధం ఘటనల్లో వైసీపీ ని టార్గెట్ చేస్తున్న అన్ని పార్టీల విమర్శలతో వ్యవహారం చర్చగా మారింది. ఒక్కో పార్టీది ఒక్కో విమర్శగా ఫైల్స్ ఫైర్ ఇష్యూ వివాదాస్పదంగా మారింది. సమగ్ర విచారణ కోసం డిమాండ్ చేస్తున్న పార్టీల తీరు పొలిటికల్ హీట్ ను పెంచుతోంది.

ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల దగ్ధం వ్యవహారం రిపీట్ అవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దగ్ధం కేసు మరవకముందే తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఫైల్స్ దగ్ధం కావడం చర్చగా మారింది. గత నెల 21 అర్ధరాత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పలు రెవెన్యూ రికార్డులు అగ్నికి ఆహుతి కావడంపై ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించింది. కేసు విచారణ దర్యాప్తు విషయంలో నేరుగా డీజీపీ కే సీఎం ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా 9 కేసులు నమోదు కాగా సిఐడి విచారణ కొనసాగుతోంది.

ఘటనలో 2400 ఫైళ్ళు కాలిపోగా దాదాపు 700 పత్రాలు సగం వరకు కాలినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే 32 మందిని ప్రశ్నించిన పోలీసులు 15 మంది అనుమానితులకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రెవెన్యూ ఉద్యోగులు, పొలిటికల్ లీడర్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఈమేరకు కేసులు కూడా నమోదు చేశారు. ఇక ఈ ఘటన మరువక ముందే తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఫస్ట్ ఫ్లోర్‌లో రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఇంజనీరింగ్ విభాగంలో చోటు చేసుకుంది. ఈ నెల 17 న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఘటన జరగ్గా ప్రమాదం విషయం ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపు మంటలను సిబ్బందే ఆర్పి వేయాగా టిటిడి ఉన్నతాధికారులు కూడా రాత్రి 7 గంటల సమయంలో సమాచారం తెలిసింది. వెలిగించిన దీపం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నా అగ్నిప్రమాదం పై మాత్రం పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే టీటీడీలో జరిగిన ఇంజనీరింగ్ పనులపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న సమయంలో అదే సెక్షన్ లోని ఫైల్స్ అగ్ని ప్రమాదానికి గురికావడం మరింత అనుమానాలకు తావిస్తోంది. అగ్ని ప్రమాదంపై టీటీడీ ఉన్నతాధికారులకు కూడా ఆలస్యంగా తెలియడంతో రాత్రి 9 గంటల సమయంలో టిటిడి పరిపాలన భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను టిటిడి చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తో కలిసి పరిశీలించారు. డీఈ ఛాంబర్ లో పాక్షిక అగ్నిప్రమాదం జరిగిందని గుర్తించారు. అయితే ఆ ఫైల్స్ ఇప్పటికే ఈ-పైలింగ్ చేసిన ఫైల్స్ గా గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. టిటిడి కి చెందిన స్థానిక ఆలయాల ఫైల్స్ గా గుర్తించామని సివీఎస్ఓ తెలిపారు. లోకల్ టెంపుల్స్ లో జరిగిన సివిల్ వర్క్స్ సంబంధించిన ఫైల్స్ పాక్షికంగా దగ్ధమయ్యాయని తేల్చారు. పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుందన్నారు టీటీడీ సీవీఎస్ఓ శ్రీధర్.

అయితే టీటీడీలో ఫైల్స్ దగ్ధం వ్యవహారం మాత్రం రాజకీయ దుమారమే రేపుతోంది. కూటమి పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా టిటిడి పైల్స్ దగ్ధంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై జనసేన వినూత్నరీతిలో మీడియా ముందుకు వచ్చింది. జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ విద్యుత్ వైర్లు, దీపాలతో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దోపిడి నుంచి తప్పించు కునేందుకే విద్యుత్ షార్ట్ సర్క్యూట్, దీపాలకు ఫైల్స్ దగ్ధం అవుతున్నాయని ఆరోపించారు. టిటిడిలో విజిలెన్స్ విచారణ జరుగుతుండగా ఫైల్స్ దగ్ధం కావడం అనుమానాలకు తావిస్తోందన్నారు.

విజిలెన్స్ ఎంక్వయిరీ లో నిజాలు బయటకు వస్తాయనే ఫైల్స్ దగ్ధం చేస్తున్నారనీ, టిటిడిలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. టిటిడిలో కొందరు అధికారుల ప్రోద్బలంతోనే ఫైల్స్ దగ్ధం అయ్యాయన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం చేసినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు కిరణ్ రాయల్. ఇక కాంగ్రెస్ కూడా ఫైళ్ల దగ్ధం వ్యవహారంపై విచారణకు డిమాండ్ చేస్తుంది. టీటీడీ లో అగ్ని ప్రమాదం జరగడం విడ్డూరమన్న కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్, టిటిడి పరిపాలనా భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయన్నారు. టీటీడీలో అవినీతిపై ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఘటనపై వారం రోజుల్లో వాస్తవాలు భక్తుల ముందు పెట్టకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చింతా మోహన్ హెచ్చరించారు.

ఇక బిజెపి, టిడిపిలు కూడా టీటీడీ ఫైల్స్ ఫైర్ ఇష్యూపై స్పందించాయి. రెండు నెలల్లో రాష్ట్రంలో పలు చోట్ల 5 అగ్ని ప్రమాదాల ఘటనలు జరిగాయన్న బిజెపి నేతలు అవినీతి, అక్రమాలు బయటపడతాయనే ఫైల్ ను తగలబెడుతున్నారనీ విమర్శించారు. ఫైల్స్ కాల్చినంత మాత్రాన నిందితులు తప్పించుకోలేరన్నారు. రాష్ట్రంలో పైళ్ల అగ్ని ప్రమాదం కథపై ఉక్కు పాదం మోపుతామన్నారు. ఏపీలోనే ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రశ్నిస్తున్నారు బిజెపి నేతలు. భవిష్యత్తులో వైసీపీ నేతలు జైళ్లకు వెళ్తారన్న భయంతో ఫైల్స్ తగల పెడుతున్నారనీ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోందని, టీటీడీ ఫైళ్ల దహనం ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని బిజెపి నేతలు భాను ప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్ లు డిమాండ్ చేస్తుండగా మాజీ సీఎం జగన్ డైరెక్షన్ లోనే ఫైళ్లు కాలిపోతున్నాయని టిడిపి ఆరోపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం