Srikakulam: ‘ధాన్యం కొనుగోలు చేస్తారా.. పురుగు మందు తాగి చావమంటారా..!’ ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతులు
రైతు ఆరు కాలం కష్టం పడి పంటను పండిస్తే.. చివరకు ఆ పండిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోడానికి ఆపసోపాలు పడుతున్నాడు రైతన్న. మా పంటను కొనుగోలు చేయండి మహా ప్రభూ అంటూ రోడ్డెక్కుతున్నాడు. తాము పండించిన ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారా అంటూ సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా LNపేట మండలం రవిచంద్రి కూడలి వద్ద మంగళవారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ధ్యానం బస్తాలతో ఉన్న ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా పెట్టి రాస్తారోకో..

ఎల్‌ఎన్ పేట, డిసెంబర్ 20: రైతు ఆరు కాలం కష్టం పడి పంటను పండిస్తే.. చివరకు ఆ పండిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోడానికి ఆపసోపాలు పడుతున్నాడు రైతన్న. మా పంటను కొనుగోలు చేయండి మహా ప్రభూ అంటూ రోడ్డెక్కుతున్నాడు. తాము పండించిన ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారా అంటూ సచివాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా LNపేట మండలం రవిచంద్రి కూడలి వద్ద మంగళవారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ధ్యానం బస్తాలతో ఉన్న ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా పెట్టి రాస్తారోకో చేపట్టారు. L.N. పేట మండలంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదు రోజులుగా పండిన ధాన్యం పంటను ట్రాక్టర్లకు లోడ్ చేసుకొని సచివాలయాల చుట్టూ, మిల్లులు చుట్టూ తిరుగుతున్నామే తప్ప తమ ధాన్యం ఎవరూ తీసుకోవటం లేదంటూ అవేదన వ్యక్తం చేశారు రైతులు. టెక్నికల్ సమస్యలనో లేక బ్యాంక్ గ్యారంటీకి తగ్గట్టు మిల్లుకు పంపాల్సిన టార్గెట్ పూర్తయింది కనుక రేపు రావాలనో సచివాలయ సిబ్బంది తిప్పుతున్నారoటూ మండిపడ్డారు.
చివరి గింజ వరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ఓవైపు అధికారులు చెబుతూనే మరోవైపు ఆరంభంలోనే తమ ధాన్యాలను కొనుగోలు చేయటానికి ఇలా తిప్పటం ఏoటoటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని రోడ్డుపై ఆందోళన విరమించాలoటూ రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసారు. చివరకు ఆందోళనకు కూడా తమకు అనుమతి ఇవ్వరా అంటూ రైతులు పోలీసుల తీరు పైన మండిపడ్డారు. తమ ఆందోళనను భగ్నం చేయాలని పోలిసులు ప్రయత్నిస్తే పురుగులు మందు తాగి చనిపోతామంటోన్న రైతులు హెచ్చరించారు. పురుగుల మందు బాటిల్స్ చేతిలో పట్టుకొని ఆందోళన చేపట్టారు.తమ ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు ఆందోళనను విరమించబోమంటోన్న రైతులు తెగేసి చెప్పారు.
రైతుల ఆందోళనతో దిగి వచ్చిన అధికార యంత్రాంగం..
రోడ్డుపై రైతుల ఆందోళన విరపించాలని పోలీసులు ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసిన రైతులు వెనక్కి తగ్గలేదు. పైగా తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం దిగి రాక తప్పలేదు. చివరకు జిల్లా పౌర సరఫరాల శాఖ D.M. శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అటు మిల్లర్లతోను, సచివాలయ సిబ్బందితోను చర్చించి వాస్తవ పరిస్థితిని సమీక్షించారు. బ్యాంకు గ్యారంటీకి తగ్గట్టుగా రోజు నిర్ణీత పరిధిలో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తున్నామని డీఎం తెలిపారు. అయితే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలుకు వస్తుండటంతో మొత్తాన్ని ఒకేసారి కొనుగోలు చేసే పరిస్థితి ఉండటం లేదనీ చెప్పారు. చివరకు తన పరిధిని ఉపయోగించి ఆన్ లైన్ ద్వారా ఆందోళనకు దిగిన రైతుల ధాన్యాల కొనుగోలు చేస్తూ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చి దగ్గరుండి మిల్లులకు ధాన్యాన్ని అప్పజెప్పారు పౌరసరఫరాల శాఖ డి.ఎం. శ్రీనివాస్. తమ ధాన్యం చివరకు మిల్లులకు చేరటంతో రైతులు ఆందోళనను విరమించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.