Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, గోల్డ్‌ రేట్స్‌ భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ఏకంగా రూ. 62 వేలు దాటేసింది. ఇక గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలో హెచ్చు, తగ్గులు కనిపించగా తాజాగా బుధవారం వారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి...

Gold Price Today: బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..
Gold Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 20, 2023 | 6:29 AM

దేశంలో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ప్రతీ రోజూ బంగారం ధరలో ఎంతోకొంత పెరుగుదల కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, గోల్డ్‌ రేట్స్‌ భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ఏకంగా రూ. 62 వేలు దాటేసింది. ఇక గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలో హెచ్చు, తగ్గులు కనిపించగా తాజాగా బుధవారం వారం దేశ వ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం బంగారం ధరలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,770 వద్ద కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయి విషయానికొస్తే ఇక్కడ22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,40 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 62,620 వద్ద కొనాసగుతోంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ. 57,950కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర అత్యధికంగా రూ. 63,220గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ. 57,400కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,620 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతో పాటు సాగర నగరం విశాఖపట్నంలోనూ ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 57,400కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,620 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర స్థిరంగా కొనసాగితే వెండి ధరలో తగ్గుదల కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధర తగ్గింది. కిలో వెండిపై బుధవారం రూ. 500 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, బెంగళూరు పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 77,500కి చేరుకుంది. ఇక చెన్నై, కేరళతో పాటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 79,500 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..