Fake Mosquito Refills: వైట్ కిరోసిన్‌తో నకిలీ రీఫిల్స్ తయారీ.. విజయవాడలో బయటపడిన దందా
Fake Mosquito Refills: మస్కిటో రెపెల్లెంట్ ఆన్ చేశాం. ఇక దోమలు పరార్. హాయిగా నిద్రపోదాం అని అనుకున్నారా? అయినా దోమలు వదల బొమ్మాళీ అని గుయ్‌మంటూ ముసురుతూనే ఉంటున్నాయా?
మస్కిటో రెపెల్లెంట్(Fake Mosquito Refills) ఆన్ చేశాం. ఇక దోమలు పరార్. హాయిగా నిద్రపోదాం అని అనుకున్నారా? అయినా దోమలు వదల బొమ్మాళీ అని గుయ్‌మంటూ ముసురుతూనే ఉంటున్నాయా? అయితే మీ మస్కిటో రెపెల్లెంట్‌ని అనుమానించకతప్పదు. అది నకిలీదేమో చూడండి. ఎందుకంటే నకిలీ మస్కిటో రీఫిల్ దందా ఒకటి బయటపడింది. ఎక్కడో చూడండి. కల్తీకేదీ కాదు అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు అక్రమార్కులు. మనం నిత్యం వాడే మస్కిటో రీఫిల్స్‌ను సైతం కల్తీ చేస్తున్నారు. అచ్చం ఒరిజినల్ రీఫిల్ మాదిరిగానే లిక్విడ్ నింపి మార్కెట్లో విక్రయిస్తున్నారు. సాధారణంగా నిత్యావసర వస్తువులు, తినుబండారాల్లో కల్తీ జరగడం చూస్తుంటాం. కానీ అక్కడ మాత్రం ఏకంగా దోమలు పోయేందుకు వాడే మస్కిటో రీఫిల్స్‌ను సైతం కల్తీ చేసేస్తున్నారు. విజయవాడ పాతబస్తీ పులిపాటివారి వీధిలో ఉన్న సాయి ధనలక్ష్మి ఫ్యాన్సీ షాపులో నకిలీ మస్కిటో రీఫిల్స్ బయటపడ్డాయి.
బెజవాడలో నకిలీ మాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. దానికి నకిలీ మస్కిటో రీఫిల్సే లేటెస్ట్ ఎవిడెన్స్. న్యూఢిల్లీకి చెందిన అస్సిడౌస్ కన్సల్టింగ్ సీనియర్ ఇన్వెస్టిగేష్ అధికారి రవీందర్ సింగ్ తీగ లాగడంతో డొంక కదిలింది. పోలీసులు బెజవాడ పాతబస్తీలో సాయి ధనలక్ష్మి షాపులో నకిలీ రీఫిల్స్ అమ్ముతున్నట్టు గుర్తించి పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు షాపులో తనిఖీ చేయడంతో 250 నకిలీ రిఫీల్స్ బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు.
ఆ షాపు యజమానిపై కేసు బుక్ చేశారు. నకిలీ రీఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. విజయవాడలోనే చిట్టూరి కాంప్లెక్స్‌లో ఉన్న బ్రాహ్మణి నావెల్టీస్ నుంచి కొన్నట్టు గుర్తించారు. అక్కడ నకిలీ సరుకు దొరకలేదు కానీ సేల్స్ చేస్తున్నట్టు తేలిందని పోలీసులు చెప్పారు.
నకిలీ మస్కిటో రీఫిల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటున్నారు నిపుణులు. నకిలీ రీఫిల్స్‌లో వాడే వైట్ కిరోసిన్ వల్ల తలనొప్పి, తలతిరగటం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. నకిలీ రీఫిల్స్‌ను ఎక్కువ కాలం వాడితే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు.
మార్కెట్లో లభించే వస్తువుల్లో ఏది ఒరిజినలో ఏది నకిలీయో గుర్తించడానికి కావాల్సిన మెలకువలను వినియోగదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వస్తువుపైనా అయినా అనుమానం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.
ఇవి కూడా చదవండి: Viral Video: లక్ష్యం కోసం రోజూ అర్ధరాత్రి 10 కి.మీటర్ల పరుగు.. ఎందుకో తెలుసా..?
Sunny Leone: కూతురు నిషాను పట్టించుకోవడం లేదని ఆరోపించిన ట్రోలర్లకు సన్నీలియోన్ కౌంటర్..