Vangaveeti Radha Krishna: పెళ్లి పీటలెక్కనున్న వంగవీటి రాధాకృష్ణ.. త్వరలోనే ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఎవరంటే..
Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా కృష్ణ.. గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఏపీ పాలిటిక్స్ లో కీలక నేత.. పొలిటికల్ లీడర్ అయిన రాధా.. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారని ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఎదురచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. త్వరలోనే వంగవీటి రాధా పెళ్ళి చేసుకోనున్నారు. ప్రస్తుతం ఈ వార్త వంగవీటి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.

Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా కృష్ణ.. గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఏపీ పాలిటిక్స్ లో కీలక నేత.. పొలిటికల్ లీడర్ అయిన రాధా.. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారని ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఎదురచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. త్వరలోనే వంగవీటి రాధా పెళ్ళి చేసుకోనున్నారు. ప్రస్తుతం ఈ వార్త వంగవీటి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. ఇంతకీ ఇన్నాళ్ల తరువాత రాధ పెళ్ళి చేసుకోనుంది ఎవరిని అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. వంగవీటి రాధాకృష్ణ త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైంది. తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయితో ఈ వివాహం నిశ్చయం అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త వంగవీటి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.
నర్సాపురానికి చెందిన జక్కం పుష్పవల్లితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైంది. ఏలూరు మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ జక్కం ఆమ్మాని బాబ్జీల చిన్న కుమార్తె జక్కం పుష్ప వల్లీ. ఆమెతోనే వంగవీటి రాధాకు వివాహం జరగబోతుంది. వీళ్లిద్దరూ వేర్వేరు కార్యక్రమాల్లో ఒకే వేదికపై కనిపించారు. ఈ నెల 19న నర్సాపురంలో ఎంగేజ్మెంట్.. అక్టోబర్లో పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు రాధాకృష్ణ..
వంగవీటి రాధా 2004లో ఓసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నా మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు అదృష్టం కలిసిరాలేదు. ఈసారి కచ్చితంగా గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి దిగాలని ఆలోచిస్తున్నారు. మరి రాధ సీట్ ఎక్కడ ఇస్తారో.. ఆయన ఎక్కడ కోరుకుంటారో అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.




వీడియో..
పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్నా వంగవీటి రాధా ఇంత వరకూ పెళ్లి చేసుకోలేదు. చివరికి ఇప్పుడు ఓ తోడు కోరుకున్నారు. నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ శనివారం నిశ్చితార్థం అయ్యాక.. అక్టోబర్‌లో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా రాధా పెళ్లి వార్త ఇప్పుడు వంగవీటి అభిమానుల్లో డబుల్ ఆనందానికి కారణమైంది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..




