Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Perni Nani: వైజాగ్ ప్రజలు పవన్ వల్ల నరకం చూశారా.. పేర్ని నాని సంచలన కామెంట్స్

జగనన్న కాలనీలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి పేర్నినాని. టీడీపీ హయాంలో ఒక్క పేదవాడికైనా ఇల్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లపై పవన్ ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

Perni Nani: వైజాగ్ ప్రజలు పవన్ వల్ల నరకం చూశారా.. పేర్ని నాని సంచలన కామెంట్స్
Perni Nani On Pawan Kalyan
Follow us
Surya Kala

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 31, 2022 | 11:21 AM

వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైకుల ముందే పవన్ కళ్యాణ్ పోరాటం కనిపిస్తోందని.. వాస్తవానికి పవన్ దిగజారిపోయి చంద్రబాబుతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌పై దాడికి తాము కుట్ర చేయడమేంటని.. ఆయన విజయవాడ ఎన్నిసార్లు వచ్చారో తెలియదా అని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ పీఏసి మీటింగ్ అయినా ప్రజల గురించి చర్చిస్తారు.. అయితే అందుకు భిన్నం జనసేన అని.. పీఏసి మీటింగ్ లో పలకరింపులకి, మంత్రులపై దాడులు చేసిన వారికి అభినందనలు తెలియజేస్తూ తీర్మానం చేశారన్నారు. అంతేకాదు గొప్ప రాజకీయ పార్టీ.. గొప్ప తీర్మానాలు చేసిందంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని.

జగనన్న కాలనీలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి పేర్నినాని. టీడీపీ హయాంలో ఒక్క పేదవాడికైనా ఇల్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లపై పవన్ ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. మహిళా మంత్రులపై దాడి చేస్తే తప్పని చెప్పకుండా.. సన్మానాలు చేయడం ఏంటన్నారు.

విశాఖ గర్జన కు, జనవాణి కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇచ్చారు..మరి పవన్ కళ్యాణ్ 7 తేదీన టికెట్స్ బుక్ చేసుకుంటే 10 తేది వరకూ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. అసలు పోలీసు అనుమతులు లేకుండా ఎందుకు ముందే టికెట్ బుక్ చేశారంటూ తన సందేహాన్ని వ్యక్తం చేశారు. విశాఖలో 4 గంటలకు పైగా అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ ర్యాలీ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టారని.. ఓ అధికారి తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. అసలు ఆ నాలుగు గంటలు విశాఖలో ప్రజలు నరకయాతన అనుభవించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు పేర్ని నాని. అసలు జనవాణి సభ పోలీసులు ఆపలేదని పవన్ తనకు తానుగానే ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని చెప్పారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి ధర్నా చెయ్యడానికి వీలు లేదని పవన్ కళ్యాణ్ కు నోటీస్ ఇచ్చారని తెలిపారు పేర్ని నాని.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..