AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode bypoll: నగదు బదిలీకి తనకూ ఎలాంటి సంబంధం లేదు.. ఈసీకి వివరణ ఇచ్చానన్న రాజగోపాల్‌ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో విశాఖ ఏజెన్సీలోని లంబసింగి, చింతపల్లి, అరకు తదితర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Munugode bypoll: నగదు బదిలీకి తనకూ ఎలాంటి సంబంధం లేదు..  ఈసీకి వివరణ ఇచ్చానన్న రాజగోపాల్‌ రెడ్డి
Komatireddy Rajgopal Reddy
Sanjay Kasula
|

Updated on: Oct 31, 2022 | 12:16 PM

Share

మునుగోడు బైపోల్‌ క్యాంపెయిన్ క్లైమాక్స్‌కు చేరింది. ఓవైపు ప్రచారం.. మరో వైపు ప్రధాన పార్టీల పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. రాజగోపాల్ రెడ్డి టార్గెట్‌గా ఆపరేషన్‌ బొగ్గు పేరుతో కాంగ్రెస్‌ డాక్యుమెంట్‌ రిలీజ్‌ చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టడానికి వేర్వేరు ఖాతాలకు నగదు బదిలీ చేశారని టీఆర్ఎస్‌ ఈసీకి కంప్లైంట్ చేసింది. ఈ ఫిర్యాదుపై ఇవాళ ఈసీకి రాజగోపాల్‌ రెడ్డి వివరణ ఇవ్వనున్నారు. టీఆర్ఎస్ ఫిర్యాదుతో మునుగోడు బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 5 కోట్ల 24 లక్షల బ్యాంకు లావాదేవీలపై పూర్తి వివరాలు వెల్లడించాలని ఈసీ ఆదేశించింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది.

ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ 

రాజగోపాల్‌ రెడ్డి కుటుంబీకుల కంపెనీల నుంచి ఓటర్లకు డబ్బులు బదిలీ చేశారంటూ TRS ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓట్ల కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో డబ్బును అకౌంట్లలోకి బదిలీ చేశారని ఆరోపించింది. తక్షణమే బీజేపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ డిమాండ్‌ చేసింది.

ఈనెల 14, 18, 29 తేదీల్లో సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌కు చెందిన బ్యాంక్ ఖాతా నుంచి.. 23 ఖాతాలకు నగదు బదిలీ జరిగిందని ఫిర్యాదులో తెలిపింది. దీంతో ఈ లావాదేవీలపై వివరణ ఇవ్వాలని ఈసీ రాజగోపాల్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చింది.

నగదు అంశానికి తనకూ ఎలాంటి సంబంధం లేదు

సుశీ ఇన్‌ఫ్రా అకౌంట్‌ నుంచి బదిలీ అయిన ఐదు కోట్లకుపైగా నగదు అంశానికి తనకూ ఎలాంటి సంబంధం లేదన్నారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి..ఇప్పటికే..దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్‌కు వివరణ కూడా ఇచ్చామన్నారు. టీఆర్ఎస్‌ ఓడిపోతుందనే ఆ పార్టీ నేతలు పిచ్చి చేష్టలు చేస్తున్నారని..ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటర్లు బొంద పెట్టడం ఖాయమంటున్న రాజగోపాల్‌ రెడ్డితో

రేపటితో ముగియనున్న ఉప ఎన్నిక ప్రచారం

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం రేపటితో ముగియనుంది. ఇప్పటివరకూ ఉప ఎన్నికలో రెండు కోట్ల 95 లక్షల రూపాయలు సీజ్‌ చేశారు. 123 మందిపై కేసులు నమోదు చేశారు. 55 మంది అరెస్టు చేశారు. ఉప ఎన్నికకు మరో మూడు రోజులే టైమ్‌ ఉంది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా చెక్‌పోస్టులు కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇటు చౌటుప్పల్‌ టోల్‌ ప్లాజా దగ్గర కేంద్రం బలగాలు ప్రచారానికి వెళ్లే వాహనాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని మునుగోడు ఉప ఎన్నికల వార్తల కోసం