Rahul Gandhi: ప్రీతిగాంధీ సిక్ పర్సన్.. ఫైరయిన కాంగ్రెస్.. ఇంతలా దిగజారిపోవాలా అంటూ కామెంట్స్

రాహుల్‌ జోడోయాత్ర రచ్చ రేపుతోంది. జనంతో మమేకమౌతూ వడివడిగా ఒకరోజు, పరుగూ నడకన ఓ రోజూ...రాహుల్‌ పాదయాత్రలో రోజుకో దృశ్యం ఆకట్టుకుంటోంది. జోడోయాత్రలో రాహుల్‌కి తోడుగా నడుస్తున్న వారూ చాలామందే ఉన్నారు. అయితే రాహుల్‌తో జతకలిసి నడిచిన అందాలనటి పూనమ్‌ కౌర్‌ ఇప్పుడు లేటెస్ట్‌ కాంట్రవర్సీకి తెరతీసింది. అదే ఇప్పుడు నేషనల్‌ పొలిటికల్‌ గ్రౌండ్‌లో కాకరేపుతోంది.

Rahul Gandhi: ప్రీతిగాంధీ సిక్ పర్సన్.. ఫైరయిన కాంగ్రెస్.. ఇంతలా దిగజారిపోవాలా అంటూ కామెంట్స్
Actress Poonam Kaur -Rahul Gandhi
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 31, 2022 | 12:03 PM

భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌తో కదం కదిపి నడిచింది నటి పూనమ్‌ కౌర్‌. రైతుల పట్ల రాహుల్‌ దృఢనిశ్చయం మనసుని తాకిందంటూ ట్వీట్లు చేసింది. అయితే రెండు రోజుల క్రితం జోడోయాత్రలో పూనమ్‌ చేయినందుకుని ముందుకు నడిపించాడు రాహుల్‌ గాంధీ. ఇదే ఘటన ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్‌ల మధ్య ట్విట్టర్‌ వార్‌కి తెరతీసింది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలతో ఇష్యూ కాకరేపుతోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్‌ కౌర్‌ ఒక్కసారిగా భారత్‌ జోడోయాత్రలో తళుక్కుమంది. చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ పూనమ్‌ కౌర్‌ రాహుల్‌తో కదం కదం కలిపింది. రెండు రోజుల క్రితం ఈ దృశ్యాలు సర్వత్రా హల్‌చల్‌ చేశాయి.

తెలంగాణలో రాహుల్‌ జోడోయాత్రలో రాహుల్‌తో చేయి చేయి కలిపి నడిచింది పూనమ్‌ కౌర్‌. ఈ సందర్భంగా చేనేతల సమస్యలపై రాహుల్‌తో మాట్లాడింది. రాహుల్‌ జతగా చేతిలో చేయివేసిన నడిచిన పూనమ్‌-రాహుల్‌ ఫొటోలు, దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.  అంతవరకూ బాగానే ఉంది. రాహుల్‌ చేతిలో చేయివేసి నడిచిన పూనమ్‌ని తప్పు పడుతూ బీజేపీ నేత ప్రీతిగాంధీ ట్విట్టర్‌లో కాంట్రవర్సీ కామెంట్స్‌ సరికొత్త వివాదానికి తెరతీశాయి. ముత్తాత అడుగుజాడల్లో రాహుల్‌ నడుస్తున్నారంటూ ప్రీతిగాంధీ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అయ్యింది.

దీనిపై ఘాటుగా స్పందించారు పూనమ్‌ కౌర్‌. ప్రధాని మోదీ నారీశక్తి గురించి మాట్లాడుతుంటే మీరు ఇంత సంకుచిత వ్యాఖ్యానాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది మిమ్మల్ని మీరే కించపరుచుకున్నట్టు ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను తడబడి పడిపోబోతుండగా రాహుల్‌ తన చేయిపట్టి నడిపించారంటూ ట్విట్టర్‌ వేదికగా సమాధానమిచ్చారు పూనమ్‌ కౌర్‌.  గ్రేట్‌ గ్రాండ్‌ ఫాదర్‌ ఫుట్‌ స్టెప్స్‌లో నడుస్తున్నారన్న ప్రీతి కామెంట్స్‌పై పలువురు కాంగ్రెస్‌ నేతలతో పాటు, శివసేన లీడర్‌ ప్రియాంక చతుర్వేది సైతం మండిపడ్డారు. పురుషులతో భుజం భుజం కలిపి నడుస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కేవలం పండిట్‌ నెహ్రూ విజన్‌ మాత్రమే కాదని, అది బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, అలాగే స్వతంత్ర సమరయోధుల కల కూడానని ఆమె ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

నటాశా శర్మ మరింత ముందుకెళ్ళి నీకు సిగ్గుందా లేదా అంటూ ప్రీతీ గాంధీని దూషించారు. ఓ స్త్రీ అయ్యుండి, ఇంతలా దిగజారిపోవడం తగదని ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ ప్రీతిని సిక్‌ పర్సన్‌గా అభివర్ణించారు. ప్రీతి వికృతమైన జబ్బుకి గురయ్యారంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం