AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morbi bridge collapse: కేబుల్ బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు.. సెకన్ల వ్యవధిలో పెను విషాదం

మోర్బీ ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఓ బీజేపీ ఎంపీ 12 మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు. రాజ్‌కోట్‌కి చెందిన ఎంపీ మోహన్‌భాయ్‌ కల్యాణ్‌జీ కుందారియా సోదరి కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

Morbi bridge collapse: కేబుల్ బ్రిడ్జ్ కూలిపోతున్న దృశ్యాలు.. సెకన్ల వ్యవధిలో పెను విషాదం
Gujarat Morbi Bridge Collapse
Ram Naramaneni
|

Updated on: Oct 31, 2022 | 12:48 PM

Share

గుజరాత్‌ మోర్బీలో కేబుల్‌ బ్రిడ్జ్‌ కూలిన ఘటనలో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. 117 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. మరికొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బ్రిడ్జ్‌ కూలడానికి కొద్ది క్షణాల ముందు సీసీ కెమెరాలో రికార్టయిన దృశ్యాలను టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా చూపిస్తోంది. 15 సెకన్లు.. కేవలం 15 సెకన్లో ఘోరం జరిగిపోయింది.. కేబుల్ బ్రిడ్జ్ కావడంతో అది చిన్నగా అటూఇటూ ఊగడం మొదలైంది. అది వైర్లు తెగిపోవడానికి ఆఖరు క్షణాలని ఎవరూ ఊహించలేదు. ఊగిసలాటను ఎంజాయ్‌ చేస్తూ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ అంతా సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే ఘోరం జరిపోయింది. రెప్పపాటులో వైర్లు తెగిపోయాయి. మొత్తం అంతా నీళ్లలో పడిపోయారు. ఏం జరిగిందో అర్థమై పైకివచ్చే టైమ్ కూడా లేదు. ఇంతలోనే తొక్కిసలాట మొదలైంది. ఈత రాని వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నారు. కేబుల్‌ బ్రిడ్జి వైర్లను పట్టుకుని వేళ్లాడిన వాళ్లలో కొందరు ఎట్టకేలకు పైకి రాగలిగారు.

కెపాసిటీకి మించి బ్రిడ్జ్‌కి పైకి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. 100 మంది కెపాసిటీ ఉన్న వంతెనపైకి 400మంది రాడంతో వంతెనే కూలినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కొంతమంది ఈత కొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. చాలా మంది వంతెనలో ఇరుక్కుపోయారు. వారిని సహాయక సిబ్బంది సురక్షతంగా బయటకు తీశారు. ఇప్పటి వరకూ 141 మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిని తమతమ కుటుంబాలకు అప్పగించారు. 11మంది గాయపడినట్లు వెల్లండించారు అధికారులు. ఆదివారం సాయంత్రం నుంచి జరిగిన రెస్క్యూ ఆపరేషన్‌లో మొత్తం 117 మందిని రక్షించారు.

ఘటనపై మోదీ సంతాపం వ్యక్తం చేశారు. వెంటనే సహాయక బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 4లక్షలు, కేంద్రం నుంచి 2లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి 50వేల ప్రకటించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మోర్బీ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..