Man thought dead: చనిపోయాడని అంత్యక్రియలు.. చిన్నకర్మ రోజు తిరిగివచ్చిన యువకుడు.!(వీడియో)
నెల్లూరు జిల్లాలో వింత ఘటన జరిగింది. చనిపోయాడనుకున్న యువకుడు తిరిగొచ్చాడు. చిన్న కర్మరోజు ఇంటికి వచ్చి అందరికి షాకిచ్చాడు. అవాక్కైన తల్లిదండ్రులు ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అప్పటి వరకు తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులు కొడుకును చూసి సంబరపడిపోయారు.
మనుబోలు మండలం వడ్లపూడి సర్పంచ్ పల్లేటి రమాదేవి కుమారుడు సతీష్ డిగ్రీ చదివాడు. కొన్నేళ్లుగా సతీష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మతిస్థిమితం లేకపోవటంతో వైద్యం చేయిస్తున్నారు. అక్టోబర్ 19న సతీష్ బైక్‌పై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి అయిన కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లి మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంతలో వెంకటాచలంలోని కనుపూరు చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. అనుమానంతో వెంటనే పోలీసులు సతీష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నీళ్లలో మృతదేహం బాగా ఉబ్బి.. గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అలాగే సతీష్ అనవాళ్లు కనిపించడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. దీంతో గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈక్రమంలోనే చిన్న కర్మకు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతలో సతీష్ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు అవాక్కయ్యారు. సతీష్ చనిపోలేదని తెలియడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధ్లులేకుండ పోయాయి. కాగా, చెరువులో దొరికిన మృతదేహం ఎవరిదన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో