Lady murdered: కుందనపు బొమ్మల ఉన్న అమ్మాయి చూస్తూ చూస్తూ అలా ఎలా..! ఛీ. విచారణలో షాకింగ్ విషయాలు.!
తన ప్రేమను కాదన్నందుకు 23 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. కేరళలోని కన్నూర్‌లో ఈ దారుణం వెలుగచూసింది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
విష్ణుప్రియను ఆమె ఇంట్లోనే హత్య చేసిన శ్యామ్ జిత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. పానూరులో వుండే విష్ణుప్రియ తండ్రి వినోద్ .. ఖతార్‌లో జాబ్ చేస్తున్నాడు. విష్ణుప్రియ పానూరులోని ఓ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌లో పనిచేస్తోంది. ఈమెకు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. విష్ణుప్రియను కూతుపరంబాకి చెందిన శ్యామ్‌జిత్ అనే వ్యక్తి తనను ప్రేమించమని ఒత్తిడి చేశాడు. నిరాకరించిన ఆ యువతిని హత్య చేయాలనుకున్నాడు. సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన ఆమెను ఓ కంట కనిపెట్టాడు. కాసేపటికే ఆ యువతి దుస్తులు మార్చుకునేందుకు ఇంటికి వచ్చింది. ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకున్న నిందితుడు.. ఇంట్లోకి చొరబడి గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు. ఆమె మెడతో పాటు చేతిపైన కత్తితో పొడిచిన గాయాలున్నాయని దర్యాప్తులో తేలింది.పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు కూడా వచ్చాయి. విష్ణుప్రియ స్నేహితుడిని కూడా హత్య చేసి, విదేశాలకు పారిపోయేందుకు శ్యామ్ జిత్ చూసినట్టుగా పోలీసులు గుర్తించారు. విష్ణుప్రియ నివాసానికి వచ్చిన శ్యామ్‌జిత్.. ఆ సమయంలో ఆమె తన ఫ్రెండ్‌తో వీడియో కాల్‌లో మాట్లాడటం కనిపించింది. వెంటనే శ్యామ్‌జిత్ విష్ణుప్రియ తలపై కొట్టాడు. అయితే విష్ణుప్రియ తలపై కొట్టడం వీడియో కాల్‌లో మాట్లాడుతున్న ఆమె ఫ్రెండ్ చూశాడు. ఈ క్రమంలోనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.