బ్రేకింగ్: గవర్నర్‌తో భేటీ అయిన చంద్రబాబు

ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. మండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. వైసీపీ మంత్రులు, సభ్యుల తీరుపై ఫిర్యాదు చేశారు. మండలి రద్దు, రాజధాని అంశం, మీడియాపై కేసులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మండలి చైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుందని, సభలో ఆయన్ని మాట్లాడనివ్వకుండా మైక్ కట్ […]

బ్రేకింగ్: గవర్నర్‌తో భేటీ అయిన చంద్రబాబు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 24, 2020 | 8:30 PM

ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. మండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. వైసీపీ మంత్రులు, సభ్యుల తీరుపై ఫిర్యాదు చేశారు. మండలి రద్దు, రాజధాని అంశం, మీడియాపై కేసులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

మండలి చైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుందని, సభలో ఆయన్ని మాట్లాడనివ్వకుండా మైక్ కట్ చేశారన్నారు. ఇంత సీరియస్‌గా బిల్లుపై చర్చకు సమయం ఇవ్వరా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమైన బిల్లులపై లాభనష్టాలు చెప్పడం ప్రతిపక్షంగా మా బాధ్యతన్నారు. అమరాతిలోనే రాజధాని ఉండాలని మేం కోరుకోవడం తప్పా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి మా సభ్యులను ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. అంతేకాకుండా.. నన్న, మా సభ్యులను డొంకరోడ్లలో 2 గంటల పాటు తిప్పారని మండిపడ్డారు. మాపై 70 మంది వైసీపీ సభ్యులు దాడికి యత్నించారని, మండలిలో ప్రత్యక్ష ప్రసారాలు, లైవ్ కట్ చేసి అవమానకరంగా ప్రవర్తించారని పేర్కొన్నారు చంద్రబాబు.