అందుకే ఇవాళ అసెంబ్లీకి సెలవిచ్చారు: దేవినేని ఉమా

శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చెల్లదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. సీఎం జగన్ ఎంత ప్రయత్నించినా మండలి రద్దు కాదన్నారు. మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేస్తే కోర్టుకెళ్తామని దేవినేని ఉమా స్పష్టం చేశారు. సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే శుక్రవారం ఏపీ అసెంబ్లీకి సెలవిచ్చారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డికి శాసనమండలిలో ఏం పని? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:40 pm, Fri, 24 January 20
అందుకే ఇవాళ అసెంబ్లీకి సెలవిచ్చారు: దేవినేని ఉమా

శాసనమండలిని రద్దు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చెల్లదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. సీఎం జగన్ ఎంత ప్రయత్నించినా మండలి రద్దు కాదన్నారు. మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేస్తే కోర్టుకెళ్తామని దేవినేని ఉమా స్పష్టం చేశారు. సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే శుక్రవారం ఏపీ అసెంబ్లీకి సెలవిచ్చారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డికి శాసనమండలిలో ఏం పని? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌ వేస్తామన్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు ఉండాల్సింది జైల్లోనే అని అన్నారు.  సీఎం జగన్‌ కోర్టుకు హాజరుకావడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.30 కోట్ల భారం పడుతుందన్నారు. మీడియా ప్రతినిధులపై నిర్భయ, దిశ కేసులు నమోదు చేస్తారా?.. మీడియా గొంతు నొక్కేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విమర్శించారు.