ఉద్యోగులూ… పాన్‌ లేదా ఆధార్ లేకపోతే 20% పన్ను..!

ఉద్యోగులు తమ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) లేదా ఆధార్ నంబర్‌ను వెల్లడించడంలో విఫలమైతే యాజమన్యం తప్పనిసరిగా 20% లేదా అంతకంటే ఎక్కువ రేటుతో పన్ను మొత్తాన్ని జీతాలు ఇచ్చే సమయంలో టీడీఎస్ (మూలాధనంలో పన్నుకోత) చేయాలని ఆదాయపు పన్ను విభాగం పునరుద్ఘాటించింది. ఈ మేరకు గత వారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఆదాయాన్ని సంపాదించే వ్యక్తులు తమ యజమానికి వారి పాన్‌ను అందించాలి, […]

ఉద్యోగులూ... పాన్‌ లేదా ఆధార్ లేకపోతే 20% పన్ను..!
Follow us

| Edited By:

Updated on: Jan 24, 2020 | 5:07 PM

ఉద్యోగులు తమ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) లేదా ఆధార్ నంబర్‌ను వెల్లడించడంలో విఫలమైతే యాజమన్యం తప్పనిసరిగా 20% లేదా అంతకంటే ఎక్కువ రేటుతో పన్ను మొత్తాన్ని జీతాలు ఇచ్చే సమయంలో టీడీఎస్ (మూలాధనంలో పన్నుకోత) చేయాలని ఆదాయపు పన్ను విభాగం పునరుద్ఘాటించింది. ఈ మేరకు గత వారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక సర్క్యులర్ జారీ చేసింది.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఆదాయాన్ని సంపాదించే వ్యక్తులు తమ యజమానికి వారి పాన్‌ను అందించాలి, ఒక వేళ ఇవ్వకపోతే 20శాతం మొత్తం కానీ, చట్టంలో వర్తించే రేటు ప్రకారం గానీ ఏది ఎక్కువ అయితే అంత మొత్తాన్ని పన్ను రూపంలో వారి వద్ద నుంచి కత్తిరించాలని తెలిపింది. సాధారణంగా 20శాతం శ్లాబు కంటే తక్కువలోకి వచ్చే ఉద్యోగులు పాన్‌, లేదా ఆధార్‌ నంబర్‌ ఇవ్వకపోతే వారికి జీతంలో 20శాతం వరకు పన్నుకోత విధిస్తారు. అదే 20శాతం శ్లాబు దాటితే ఎంత అయితే అంత కోత విధించడంతోపాటు 4శాతం హెల్త్‌, ఎడ్యూకేషన్‌ సెస్‌ కూడా వసూలు చేస్తారు.

గత సంవత్సరం జారీ చేసిన సర్క్యులర్, కంపెనీలు ఆర్థిక సంవత్సరాంతానికి తమ ఖాతాలను సిద్ధం చేస్తున్నప్పుడు, యజమానులు అన్ని పన్ను బకాయిలను అంచనా వేయాలని ఆదాయపు పన్ను శాఖా తెలిపింది. యాజమాన్యాలు ఈ టీడీఎస్‌ నియమాలను పాటించకపోతే వారికి జరిమానాలు విధిస్తామని వెల్లడించింది. అమలులో ఉన్న రేట్ల ఆధారంగా ఆదాయపు పన్ను సగటు రేటు 20% కన్నా తక్కువ ఉంటే, మినహాయింపు 20% చొప్పున చేయాలి. సగటు రేటు 20% దాటితే, పన్నును సగటు రేటుకు తగ్గించాల్సి ఉంటుందని సర్క్యులర్ తెలిపింది. 20% చొప్పున టీడీఎస్ చేస్తే 4% ఆరోగ్యం మరియు విద్య సెస్ తగ్గించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఉద్యోగి యొక్క ఆదాయం 2.5 లక్షల పన్ను పరిధిలోకి వచ్చినట్లయితే, టిడిఎస్ అవసరం లేదు.

యజమానులు తమ టిడిఎస్ బాధ్యతలలో ఖచ్చితంగా ఉండాలని, ఏవైనా తప్పులు దొర్లితే జరిమానా కట్టాల్సి వస్తుందని సర్క్యులర్ తెలిపింది. చలాన్లు, టిడిఎస్-సర్టిఫికెట్లు, స్టేట్‌మెంట్లు, జారీ చేసిన ఇతర పత్రాలలో యజమానులు పన్ను మినహాయింపు సేకరణ ఖాతా సంఖ్య (టిఎఎన్) ను పొందాలని.. దానిని కోట్ చేయాలని సర్క్యులర్ పునరుద్ఘాటించింది. అలా చేయడంలో విఫలమైతే ₹ 10,000 జరిమానా వేస్తామని సర్క్యులర్ తెలిపింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..