మనసున్న మంచి మనుషులు ఈ అనిమల్ ట్రాకర్స్.. జోరు వర్షంలో ఏనుగుకు సపర్యలు..

ఏపీ, తమిళనాడు సరిహద్దులోని కుప్పం అటవీ ప్రాంతంలో ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. ఈ వర్షంలో ఒక ఏనుగు అనారోగ్యంతో అపస్మారక స్థితిలో పడిపోయింది.

మనసున్న మంచి మనుషులు ఈ అనిమల్ ట్రాకర్స్.. జోరు వర్షంలో ఏనుగుకు సపర్యలు..
Elephant
uppula Raju

|

Jul 16, 2021 | 11:48 AM

ఏపీ, తమిళనాడు సరిహద్దులోని కుప్పం అటవీ ప్రాంతంలో ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. ఈ వర్షంలో ఒక ఏనుగు అనారోగ్యంతో అపస్మారక స్థితిలో పడిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అనిమల్ ట్రాక్టర్స్‌కు సమాచారం అందించారు. జోరు వర్షంలో వారు ఏనుగు వద్దకు వచ్చి సపర్యలు చేస్తూ ఎనుగును బతికించడానికి ప్రయత్నించారు. వారి క‌ృషిని గుర్తించిన స్థానికులు మనసున్న మంచి మనసులు అంటూ అభినందించారు.

తమిళనాడులోని క్రిష్ణగిరి అటవీ ప్రాంతం పరిధిలోకి వచ్చే డెకనికోట ప్రాంతంలో పడిపోయిన ఏనుగు వద్దకు చేరుకున్న అనిమల్ ట్రాకర్లు వర్షంలో తడుస్తూ అపస్మారక స్థితిలో పడి ఉన్న ఏనుగు కు షెల్టర్ ఏర్పాటు చేశారు. వర్షంలో తడవకుండా టెంట్ ను ఏర్పాటు చేశారు. హోసూరు నుంచి వైద్యులను తీసుకొచ్చి వైద్యం అందించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఏనుగు కదలికలను గుర్తిస్తూ అక్కడే ఉండిపోయారు. కాస్త కోలుకొని నడవగలిగే శక్తి వస్తే అడవిలోకి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గజరాజు పట్ల ఔదార్యం చూపిన అనిమల్ ట్రాకర్స్ ను గ్రామస్థులతో పాటు, అటవీశాఖ అధికారులు, వైద్యులు అభినందించారు.

ఇదిలా ఉంటే.. కుప్పం అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటుంది. గుంపులు గుంపులుగా సంచరిస్తాయి. తమిళనాడు, ఇటు చిత్తూరు ప్రాంతాల్లోని రైతులు వీటివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందలుగా వచ్చి పంటపొలాలపై దాడి చేసి నాశనం చేస్తుంటాయి. దీంతో పంటలను కాపాడుకోవడానికి రైతులు రాత్రిబవళ్లు కాపాలా ఉండేవారు. వీరితో అటవీ శాఖ అధికారులు కూడా అడవిలోనే గడిపేవారు. కొన్ని కొన్ని సంఘటనలలో ఏనుగుల దాడికి ప్రాణాలో కోల్పోయిన రైతులు కూడా ఉన్నారు.

Sridevi Vijaykumar: భర్త, కూతురితో శ్రీదేవి విజయ్ కుమార్ లేటెస్ట్ ఫోటోలు..

Surekha Sikri Dies : ‘చిన్నారి పెళ్లి కూతురి’ బామ్మగారు సురేఖా సిక్రీ ఇక లేరు.. గుండెపోటుతో మృతి

World Snake Day: పాములు వాసనను, సౌండ్‌ను ఎలా గుర్తిస్తాయో తెలుసా? పలు ఆసక్తికర విషయాలు మీకోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu