Narender Vaitla | Edited By: Janardhan Veluru
Updated on: Jul 16, 2021 | 11:05 AM
పాములు అనగానే భయం వేయడం సర్వసాధారణమైన విషయం. కానీ పాములకు కూడా ఓ రోజునుందని మీకు తెలుసా? జులై 16ను ప్రపంచ పాముల దినోత్సవంగా జరుపుతారు. ఈ సందర్భంగా పాములకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషాయాలు మీకోసం..
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3000కి పైగా జాతుల పాములు ఉన్నాయి. అంటార్కిటికాలో తప్ప ప్రపంచమంతా పాములున్నాయి.
పాములు వాటి నోటిని 150 డిగ్రీల వరకు తెరవగలవు దీని ద్వారా అవి తమకంటై పరిమాణంలో 75 నుంచి 100 శాతం పెద్దగా ఉన్న వాటిని కూడా మింగేయగలవు.
నీళ్లలో ఉండే పాములు వాటి శరీరం ద్వారా గాలిని పీల్చుకుంటాయి. సాధారణంగా భూమిపై ఉండేవి చర్మం ద్వారా గాలి తీసుకుంటాయి. పాములకు చెవులు ఉండవు అవి దవడ వద్ద ఉండే ప్రత్యేక అవయవం ద్వారా పరిసరాల కదలికలను గుర్తిస్తుంది. పాములు నాలుక ద్వారా వాసనను గుర్తిస్తాయి.
ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే పాము బ్లాక్ మాంబా. ఇది గంటకు 20 కి.మీల వేగంతో పరిగెత్తగలదు.
ప్రపంచంలో అత్యంత చిన్న పాము పేరు బ్రహ్‌మిని బ్లైండ్ స్నేక్. ఇది రెండున్నర ఇంచులు మాత్రమే ఉంటుంది. చాలా సార్లు వీటిని వానపాముగా భ్రమపడుతుంటారు.
రెండు తలలు ఉండే పాములు ఆహారం కోసం ఒక తలతో మరొకటి పోటీ పడుతుంటుంది. కానీ ఆ రెండు తలలు తీసుకునే ఆహారం ఒకే శరీరానికి అనే విషయం వాటికి తెలియదు.
3000 జాతుల్లో కేవలం 700 జాతుల పాములు మాత్రమే విషాన్ని చిమ్ముతాయి.
కొన్ని పాములు ఏడాది పాటు ఎలాంటి ఆహారం లేకుండా జీవించగలవు.