- Telugu News Photo Gallery Viral photos Viral photos georgia woman finds family of 18 snakes living under her bed
Viral Photos: బెడ్ కింద పాముల కుప్ప.. తాడు ముక్కలనుకుని కదిలించిన మహిళ.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
సాధారణంగా పాములు ఏ చెట్ల మధ్యనో, పుట్టల మధ్యనో జీవిస్తుంటాయి. గుడ్లు పెట్టి పిల్లలను పెడతాయి. కానీ, ఇక్కడ ఓ పాము ఏకంగా నివాస గృహాన్నే..
Updated on: Jul 15, 2021 | 7:21 PM

సాధారణంగా పాములు ఏ చెట్ల మధ్యనో, పుట్టల మధ్యనో జీవిస్తుంటాయి. గుడ్లు పెట్టి పిల్లలను పెడతాయి. కానీ, ఇక్కడ ఓ పాము ఏకంగా నివాస గృహాన్నే తన మకాంగా మార్చేసింది. అది కూడా బెడ్‌రూమ్‌లో బెడ్ కింద తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. అక్కడే గుడ్లు పెట్టి, పిల్లలను కూడా పెట్టింది.

అమెరికా జార్జియాలోని అగస్టా ప్రాంతంలో ఇళ్లు ఉంది. ఆ ఇంట్లో బెడ్‌రూమ్‌లో మకాం వేసిన పాము 18 పిల్లలను పెట్టింది.

ఇంట్లో ఉన్న మహిళ ట్రిష్ విల్చర్.. బెడ్ రూమ్ క్లీన్ చేస్తుండగా.. బెడ్ కింద భారీ పాముతో పాటు 18 పాము పిల్లలు ఉండటాన్ని గమనించింది. అది చూసి ఆమె షాక్ అయ్యింది.

ముందుగా వాటిని తాడు ముక్కలుగా భావించిన విల్చర్.. వాటిని క్లీన్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే.. ఒక్కసారిగా అవి కదలడంతో భయంతో హడలిపోయింది.

విల్చర్ తన భర్త మాక్స్‌కు పాముల గురించి చెప్పడంతో అతను.. ఒక పరికరం సహాయంతో ఆ పాములను సంచిలో వేసి.. నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు.

ఈ పాముల ఫోటోలను విల్చర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంటి వద్ద నిర్మానుష్య ప్రాంతం ఉన్నందున పాములు వచ్చి ఉంటాయని అభిప్రాయపడింది. అయితే, పాములను చూసి భయపడిపోయిన విల్చర్‌కు రాత్రి అంతా నిద్రే పట్టలేదట. ఎక్కడైనా కూర్చోవాలన్నా.. బయట తిరగాలన్నా హడలిపోతోందట. అయితే మరుసటి రోజు వన్యప్రాణులను హ్యాండిల్ చేసే వారు వచ్చి ఇళ్లంతా గాలించి పాములు లేవని చెప్పారు. దాంతో విల్చర్ ఊపిరి పీల్చుకుంది.
