Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో గజరాజు.. చెరువు కట్టపై వెళ్తూ జారి పడి ఏనుగు మృతి.. ఆ ప్రాంతంలో భయం భయం..

చిత్తూరు జిల్లాలోని కల్లూరు - సదుం మార్గంలో చిట్టారెడ్డిపేట దగ్గర సంచరిస్తున్న ఏనుగుల గుంపులో ఓ ఏనుగు చనిపోవడం కలకలం రేపుతోంది. చెరువు కట్టపై వెళుతూ ఏనుగు జారి పడి చనిపోయింది. దీంతో గుంపులోని మిగతా ఏనుగులు రెచ్చిపోయాయి. ఏనుగుల భయంతో ఆ ప్రాంతంలో అడుగు పెట్టేందుకు స్థానికులు, ఫారెస్ట్ అధికారులు వణికిపోతున్నారు.

అయ్యో గజరాజు.. చెరువు కట్టపై వెళ్తూ జారి పడి ఏనుగు మృతి.. ఆ ప్రాంతంలో భయం భయం..
Elephants
Shaik Madar Saheb
|

Updated on: Jul 05, 2025 | 1:46 PM

Share

చిత్తూరు జిల్లాలోని కల్లూరు – సదుం మార్గంలో చిట్టారెడ్డిపేట దగ్గర సంచరిస్తున్న ఏనుగుల గుంపులో ఓ ఏనుగు చనిపోవడం కలకలం రేపుతోంది. చెరువు కట్టపై వెళుతూ ఏనుగు జారి పడి చనిపోయింది. దీంతో గుంపులోని మిగతా ఏనుగులు రెచ్చిపోయాయి. ఏనుగుల భయంతో ఆ ప్రాంతంలో అడుగు పెట్టేందుకు స్థానికులు, ఫారెస్ట్ అధికారులు వణికిపోతున్నారు. కొద్దిరోజులుగా పులిచెర్ల కొండ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. కల్లూరు సమీపంలో ఏనుగుల గుంపు వచ్చి బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలోనే.. పులిచెర్ల మండలం కల్లూరు సమీపంలోని చిట్టారెడ్డి గ్రామం వద్ద.. చెరువు కట్టపై వెళుతూ ఏనుగు జారి పడి మృతి చెందిందని అధికారులు తెలిపారు. 17 ఏనుగుల గుంపులోని ఒక ఏనుగు మృతి చెందినట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు.. కళేబరాన్ని అక్కడినుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఏనుగుల గుంపు అటువైపు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు.. కానీ.. ఘటనా స్థలానికి సమీపంలోనే ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో సమీప గ్రామల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాగా.. పులిచెర్ల మండలంలో తిష్ట వేసిన ఏనుగుల గుంపు పాత పేట అటవీ ప్రాంతంలో పంటపొలాలను ధ్వంసం చేశాయి. మామిడి, అరటి, టమోటా తోటలను ఏనుగుల గుంపు తొక్కి నాశనం చేశాయి. ఏనుగుల దాడిలో తమ పంటలు తీవ్రంగా నష్టపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతో గుంపులోని ఏనుగు మృతి చెందడంతో మిగతా ఏనుగులు ఏం చేస్తాయో అని రైతులు, గ్రామస్తులు మరింత భయపడుతున్నారు.

Elephant Dies Near Kallur

Elephant Dies Near Kallur

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో